Suryaa.co.in

Andhra Pradesh

ఇదొక దున్నపోతు ప్రభుత్వం.. ముళ్లకర్ర తీసుకుని కొట్టాలి

-ప్రజల జీవితాలతో ఆడింది చాలదా?
-కుల, మత, ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారు
-ఒక్క ఎంపీ అయినా ఏనాడైనా మన రాష్ట్రం గురించి ఆలోచించారా?
-ఇప్పటివరకు 63 మంది ఎమ్మెల్యేలను మార్చారు
-సొంత సామాజికవర్గం వారిని ఒక్కరిని కూడా మార్చలేదు
-బొత్స, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి కలిసి భూములు, చెరువులు కబ్జా చేస్తున్నారు
-గాలిపైనా పన్నువేసే వ్యక్తి జగన్
-బొత్స వద్ద ఇంకులేని పెన్ను ఉంది. కానీ ఇంకు చిన్న శీను దగ్గర ఉంటుంది
-సాలూరు శంఖారావం సభలో యువనేత నారా లోకేష్

ఉత్తరాంధ్ర యూత్ పవర్ అదిరిపోయింది, దద్దరిల్లింది. ఉద్యమాల గడ్డ ఉత్తరాంధ్ర. ఉత్తరాంధ్రలో పైడితల్లి అమ్మవారు ఉన్నారు. అల్లూరి సీతారామరాజు నడిచిన నేల ఈ ప్రాంతం. ఇలాంటి పవిత్ర నేలపై నేను మట్లాడటం నా అదృష్టంగా భావిస్తున్నాను.

ఈ మధ్య జగన్ రెడ్డి ఎక్కడా కనిపించడం లేదు. మీకు ఎక్కడైనా కనిపిస్తున్నారా? మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన నీళ్లు తాగి జగన్ రెడ్డికి డయేరియా వచ్చింది. ఇదో చెత్త ప్రభుత్వం. సురక్షితమైన తాగునీరు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కలుషిత నీరు తాగి గుంటూరులో ఇద్దరు చనిపోయారు. వందలాది మంది ఆసుపత్రి పాలయ్యారు.

ఇంతమంది చనిపోతున్నా కనీసం ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి సమీక్ష చేయేలేదు. ఇదొక దున్నపోతు ప్రభుత్వం. ముళ్లకర్ర తీసుకుని కొట్టాలి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. టీడీపీ మహానాడులో చంద్రబాబు నాటిన తులసిమొక్క అన్నారు. ఇప్పుడు జగన్ పెంచిన గంజాయి మొక్కలా ఎలా మారారని ప్రశ్నిస్తున్నా. జగన్ రెడ్డికి ఈ మధ్య సినిమా పిచ్చి ఎక్కువైంది. ఆ వంకర నవ్వుతో సినిమా చేయలేడు. ఇమేజ్ పెంచుకోవడానికి సినిమాలు తీస్తాడు. ఈ మధ్య తీసిన యాత్ర-2 అట్టర్ ప్లాప్ అయింది.

సొంత పార్టీ ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు ఫ్రీగా టికెట్లు ఇచ్చినా సినిమా చూడని పరిస్థితి, ఛీ పో అన్నారు. సినిమా తీసి ప్రొడ్యూసర్ కు బాగా నష్టం వచ్చింది. జగన్ రెడ్డి దగ్గరికి వెళ్లి ఆదుకోమంటే చీ పో అన్నారు. అతడికి కోపం వచ్చి అంతిమయాత్ర అని పోస్టర్ తయరు చేశాడు. డబ్బులు ఇవ్వకపోతే అంతిమయాత్ర సినిమా తీస్తాననడంతో భయపడిపోయాడు. ఆ నష్ట తీర్చడానకి ఎప్పుడూ లేనివిధంగా హార్సిలీహిల్స్ ఖరీదైన రెండు ఎకరాల ప్రభుత్వ భూమి ఆ ప్రొడ్యూసర్ కు రాసి ఇచ్చారు. వాళ్లకు భూమి ఇవ్వాలనుకుంటే ఇడుపులపాయలలో మీ భూమి ఇవ్చొచ్చు కదా.

జగన్ రెడ్డిని చూస్తే పిట్టల దొర గుర్తుకువస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కేలో ఆంధ్రాను ఆడుదాం ఆంధ్రా అని మార్చారు. ప్రజల జీవితాలతో ఆడింది చాలదా? ఎన్నికల ముందు నియోజకవర్గానికో ఇండోర్ స్టేడియం నిర్మిస్తామన్నారు. క్రికెట్ అకాడమీ ఏర్పాటుచేస్తామన్నారు. మన నియోజకవర్గానికి ఇంతవరకు ఇండోర్ స్టేడియం కట్టారా?

జగన్ ఐపీఎల్ టీం పెడతానంటున్నాడు. అసలు యాత్ర-2లో జగన్ రెడ్డి నటిస్తే సరిపోయేది. ఐపీఎల్ టీం పేరు కోడికత్తి వారియర్స్ . ఆ టీమ్ లో ప్లేయర్స్ ఆల్ రౌండర్ అవినాష్ రెడ్డి. బాబాయిని కత్తితో పొడిచి చంపాడు కదా. బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్, అరగంట స్టార్, అంబటి రాంబాబు, గంట స్టార్ అవంతి శ్రీనివాస్, సీనియర్ బ్యాట్స్ మెన్ గోరంట్ల మాధవ్, రీల్ స్టార్ ఎంపీ మార్గాని భరత్, బూతుల స్టార్ సన్నబియ్యం సన్నాసి కొడాలి నాని, కమెడియన్ బియ్యపు మధుసూదన్ రెడ్డి. టీం బాగుందా?

25కు 25 ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తామన్నారు. మొత్తం వైసీపీకి 31 మంది ఎంపీలు ఉంటే ఏం పీకారు? ఏనాడు ప్రత్యేక హోదా గురించి అడిగలేదు. పైగా కేంద్రంలో వైకాపా ఎంపీలు మన పరువు తీశారు. ఒక ఎంపీనేమో జిప్పులు విప్పదీసి అన్నీ చూపిస్తాడు, మరోఎంపీ బాబాయిని లేపేసిన వ్యక్తి. సీబీఐ వస్తే కర్నూలు ఆసుపత్రిలో దాక్కుంటాడు. ఓ ఎంపీ టిక్ టాక్, యూట్యూబ్ రీల్స్ లో బిజీగా ఉంటాడు. ఓ ఎంపీ భార్య, కొడుకుని కిడ్నాప్ చేస్తే మొత్తం కుటుంబం పారిపోయి హైదరాబాద్ లో బతికే పరిస్థితి.

ఇంకో పిల్లిగడ్డం ఎంపీ విజయసాయిరెడ్డి ఉన్నాడు. జగన్ కేసుల్లో ఏ-2. ఆయన అన్ని అవినీతి వ్యవహారాల్లో నా వాటా ఉందా అని చూసుకుంటాడు. ఒక్క ఎంపీ అయినా ఏనాడైనా మన రాష్ట్రం గురించి ఆలోచించారా?

ఆడుదాం ఆంధ్రాలో కూడా రాజకీయాలు తీసుకువచ్చారు. మన నియోజకవర్గం పార్లమెంట్ లోనే ఫస్ట్ వస్తే ఆ టీంలో టీడీపీ కార్యకర్తలు ఉన్నారని ఆ టీంను కూడా పంపలేదు ఈ ప్రభుత్వం. నాకు కులం లేదు, పార్టీ లేదు, మతం లేదు అంటాడు. ఇప్పుడు కుల, మత, ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారు. కొత్తగా వైకాపా నాయకులు సామాజిక బస్సుయాత్ర చేస్తున్నారు. అది కాస్తా తుస్తుమంది. జగన్ సామాజిక అన్యాయం చేస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యేలే చెబుతున్నారు.

ఇప్పటివరకు 63 మంది ఎమ్మెల్యేలను మార్చారు. 16 మంది ఎంపీలను ట్రాన్స్ ఫర్ చేశారు. వారిలో 90 శాతం మంది బీసీ, ఎస్సీలే ఉన్నారు. సొంత సామాజికవర్గం వారిని ఒక్కరిని కూడా మార్చలేదు. వారి పార్టీకి చెందిన బీసీ నాయకుడు యాదవ సామాజికవర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తి గారు బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. బీసీలకు తగిన గౌరవం ఇవ్వడం లేదని లేదని వాపోయారు.

పద్మశాలి వర్గానికి చెందిన ఆ పార్టీ ఎంపీ సంజీవ్ కూడా వైసీపీలో బీసీలకు గౌరవం లేదని చెప్పారు. ఇంకో ఎమ్మెల్యే పార్థసారథికి జగన్ కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు.బీసీలకు రావాల్సిన 27 సంక్షేమ పథకాలు రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి. 10 శాతం రిజర్వేషన్ తగ్గించి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 16,800 పదవులు రాకుండా చేశారు. బీసీలపై 27వేల కేసులు పెట్టారు. బీసీల వెన్నెముక విరగొట్టారు. జయహో బీసీ అంటూ కలిసికట్టుగా పోరాడి బీసీలంతా జగన్ వెన్నెముక విరగ్గొట్టాలి.

జగన్ రెడ్డి కటింగ్, ఫిట్టింగ్ మాస్టర్. బల్ల పైన బులుగు బటన్ నొక్కి అకౌంట్ లో రూ.10 వేసి, బల్ల కింద ఉన్న రెడ్ బటన్ తో వంద లాగేస్తున్నారు. కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు పెంచి బాదుడే బాదుడే. ఆంధ్రా గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్ తో లిక్కర్ రేట్లు పెంచారు. గాలిపైనా పన్నువేసే వ్యక్తి జగన్. అన్న క్యాంటీన్లు, పెళ్లి కానుకలు, విదేశీ విద్య, పండుగ కానుకలు, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్ మెంట్, పెన్షన్ లు కట్, రైతులకు రావాల్సిన డ్రిప్ ఇరిగేషన్ కూడా కట్.. ఇలా దేశంలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ రెడ్డి.

ఏపీకి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. కేజీ రూ.2కే బియ్యం, ఆస్తిలో సమాన హక్కు, రూ.50కే హార్స్ పవర్ మోటార్ ఇచ్చారు. చంద్రబాబు దీపం పథకం వంటి ఎన్నో కార్యక్రమాలు అమలు చేశారు. ప్రజల కష్టాలను తొలగించేందుకు చంద్రబాబు-పవనన్న కలిసి సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు.

యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేం తీసుకుంటాం. ప్రతి ఏడాది డీఎస్సీ భర్తీ చేస్తాం. ప్రతి ఏడాది ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తాం. జీవో 3 పునరుద్ధరించి షెడ్యూలు ఏరియాలో గిరిజనులకే ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగం రాని వారికి అప్పటివరకు 3వేల నిరుద్యోగ భృతి ఇస్తాం. స్కూల్ కు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15వేలు ఇస్తాం, ఇద్దరుంటే రూ.30వేలు, ముగ్గురుంటే ఏడాదికి రూ.45 వేలు మన ప్రభుత్వం ఇస్తుంది. ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఆర్థిక సాయం చేస్తాం. ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతోంది మన ప్రభుత్వం. ఇక కట్టెల పొయ్యికి బాయ్ బాయ్ చెప్పే రోజులు వస్తాయి.

18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500 ఇస్తాం, ఏడాదికి రూ.18వేలు, ఐదేళ్లలో రూ.90 వేలు ఇచ్చి ఆదుకునే బాధ్యత టీడీపీ-జనసేన తీసుకుంటుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్. మూడు రాజధానులు అని మూడు ముక్కలాట ఆడారు. ఎక్కడా ఒక్క ఇటుక వేయలేదు.

మూడు కుటుంబాలకు జగన్ లైసెన్స్ ఇచ్చారు. బొత్స, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి కలిసి భూములు, చెరువులు కబ్జా చేస్తున్నారు. ఆనాడు పెద్దవాళ్లు విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అని నినదించి స్టీల్ ప్లాంట్ సాధించారు. దీనిని ప్రైవేటీకరించేందుకు జగన్ కుట్ర పన్నారు. మనం వస్తే ఆ ఉక్కు ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి కాపాడుకుంటుంది.

విజయనగరం జిల్లాకు జగన్ 50 హామీలు ఇచ్చారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ పూర్తిచేస్తామన్నారు, చేశారా? లేదు. రామతీర్థం ప్రాజెక్టు పూర్తిచేస్తామన్నారు. ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తిచేయలేదు. గోస్తా-చంపావతి నదుల అనుసంధానం చేయలేదు. రామభద్రాపురం, పెద్దగడ్డ ప్రాజెక్టులు పూర్తిచేస్తామని చెప్పి చేయలేదు.

సాలూరు బై పాస్ రోడ్డు, పాలేరు నదిపై డ్యా నిర్మాణం, స్వర్ణముఖి-చిట్టిగడ్డపై బ్రిడ్జిపై నిర్మిస్తామన్నారు. ఏమైనా చేశారా? పరిశ్రమలు తీసుకువచ్చి ఉద్యోగాలు కల్పిస్తామనే హామీని నిలబెట్టుకోలేదు.

నాడు నేడు ఎప్పుడూ విజయనగరం జిల్లాను అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. రోడ్లు, బ్రిడ్జిలు, పక్కా గృహాలు నిర్మించాం. సాలూరులో గెలవకపోయినా టీడీపీ హయాంలో సాలూరును అభివృద్ధి చేశాం. హైవే కనెక్టివిటీ తీసుకువచ్చాం. ఓవర్ బ్రిడ్జిలు, బైపాస్ లు కూడా నిర్మించాం.

జిగిరాం జూట్ మిల్ ను మనం తీసుకువస్తే ఇప్పుడు మూసేశారు. బీటీ, సీసీ రోడ్లు, డ్రైయిన్లు వేసింది టీడీపీ ప్రభుత్వం. సాలూరు పట్టణంలో నిరుపేదలకు పక్కా గృహాలు నిర్మించాం. అవి కూడా ఇవ్వలేని స్థితిలో వైకాపా ఉంది. 100 పడకల ఆసుపత్రికి నిధులు కేటాయిస్తే వైకాపా వచ్చిన తర్వాత వదిలేశారు.

రాజన్న దొరగారిని 4 సార్లు గెలిపించారు. ఉపముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. అలాంటప్పుడు ఎలా అభివృద్ధి చేయాలి? ఆయన వద్ద ఇంకులేని పెన్ను ఉంది. కానీ ఇంకు చిన్న శీను దగ్గర ఉంటుంది. ఆయన ఇంకు పోస్తేనే ఈ పెన్ను రాస్తుంది. రిమోట్ కంట్రోల్ ఎమ్మెల్యే. చిన్న శ్రీను వద్ద రిమోట్ ఉంటుంది. లెఫ్ట్ తిరగమంటే లెఫ్ట్, రైట్ తిరగమంటే రైట్ తిరుగుతారు.

ఉపముఖ్యమంత్రి అయినా మన జీవితాల్లో మార్పు వచ్చిందా? ఒకసారి కోర్టు ద్వారా ఎమ్మెల్యే అయ్యారు. పెద్ద ఎత్తున భూకబ్జాలు చేసి బినామీ పేర్లపై పెట్టారు. గిరిజనుల సమస్యలను ఒక్కటి కూడా పరిష్కరించలేక పోతున్నారు. 2024లో టీడీపీ-జనసేన అభ్యర్థిని గెలిపిస్తే ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. రెండేళ్లలో 100 పడకల ఆసుపత్రిని పూర్తిచేస్తాం. యుద్ధప్రాతిపదికన సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేస్తాం. ఐటీడీఏలకి తగిన నిధులు ఇచ్చి తండాల్లో ఇళ్లు నిర్మిస్తాం.

ఇక్కడ లారీ బిజినెస్ పై చాలా మంది ఆధారపడిఉన్నారు. లారీ డ్రైవర్,ఓనర్లును కలిశా. వారిపైనా బాదుడే బాదుడే. రెండు నెలలు ఓపిక పడితే దేశంలోనే అతి తక్కువ పన్ను వేసే బాధ్యత తీసుకుంటాం. మూతపడిన జూట్ మిల్లు తెరిపించే బాధ్యత మేం తీసుకుంటాం. కియా మాదిరిగా ఉత్తరాంధ్రకు పెద్దఎత్తున పరిశ్రమలు తీసుకువస్తాం. సెజ్ ఏర్పాటుచేసి స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తాం. జీవో 3 పునరుద్ధరిస్తాం. గిరిజనులకు ఆగిపోయిన 17 సంక్షేమ కార్యక్రమాలు పునురుద్ధరిస్తాం. రాష్టవ్యాప్తంగా ఎస్టీ నియోజకవర్గాల్లో 7కు 7 టిడిపిని గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తాం.

2014లో కార్యకర్తల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటుచేసి వంద కోట్లు ఖర్చు చేయడం జరిగింది. చనిపోయిన కార్యకర్తల కుటుంబాల పిల్లలను దత్తత తీసుకుని మా తల్లి భువనేశ్వరి చదివిస్తున్నారు. నాకు అక్కా చెల్లెళ్లు, అన్నా తమ్ముళ్లు లేకపోయినా 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు.

2019 నుంచి 2024 వరకు మనపై అనేక కేసులు పెట్టారు. నాపై 22 కేసులు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. అటెమ్ట్ మర్డర్ కేసు పెట్టారు. 2019కి ముందు ఏనాడూ పోలీస్ స్టేషన్ కు వెళ్లలేదు. అయినా ఈ లోకేష్ తగ్గేదే లేదు.

ఏ అధికారి చట్టాన్ని ఉల్లంఘించి ఇబ్బంది పెట్టారో, వైకాపా నాయకులు ఇబ్బంది పెట్టారో వారి పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయి. జనసేన వాళ్లు కూడా పేర్లు పంపిస్తున్నారు. రెండు నెలలు ఓపిక పట్టండి. వారిపై జ్యుడీషియరీ ఎంక్వై్రీ వేసి జైలుకు పంపే బాధ్యత నేను తీసుకుంటా.

ఎన్టీఆర్ మీ అందరికీ రాముడు, చంద్రబాబు దేవుడు, లోకేష్ వైకావా వాళ్లకు మూర్ఖుడు. చంద్రబాబును ఆనాడు అక్రమంగా రిమాండ్ కు పంపిస్తే నాకు మొదట ఫోన్ చేసింది పవనన్న. మీకు అండగా నిలబడతానని, ఏం కావాలన్నా ఒక్క ఫోన్ చాలని చెప్పారు. కార్యకర్తలందరూ ప్రతి గడపకు వెళ్లి సూపర్-6 కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలి. టీడీపీ కార్యక్రమాలను ప్రజల్లోకి బాగా తీసుకెళ్లిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తాం. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి ఇస్తా.

చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు పవన్ రాష్ట్రానికి వస్తుంటే ఆయన విమానానికి పర్మిషన్ క్యాన్సిల్ చేసిందీ ప్రభుత్వం. రోడ్డు మార్గంలో రావాలని ప్రయత్నిస్తే ఏపీ బోర్డర్ లో 3గంటలు ఆపేశారు. ఆంధ్రా ఏమైనా పాకిస్థానా? ఈ సద్దాం హుస్సేన్ పాలన వల్ల ఆంధ్రా పాకిస్థాన్ లా మారిపోయింది.

అందుకే సైకో జగన్ ను తరిమికొట్టాలని చంద్రబాబు-పవన్ నిర్ణయించుకున్నారు. పవనన్న చెప్పినట్లు హలో ఏపీ-బైబై వైసిపి నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. టీడీపీ-జనసేన మధ్య చిచ్టుపెట్టేందుకు వైకాపా పేటీఎం బ్యాత్ ప్రయత్నిస్తుంది. వారికి రూ.5 ఇస్తే చాలు. వారి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. టీడీపీ-జనసేన అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. సీనియర్లు, జూనియర్లు అందరినీ గౌరవిస్తా. కానీ పనిచేసే వారినే ప్రోత్సహిస్తా

LEAVE A RESPONSE