-లోకమంతా మెచ్చిన నాయకుడు నారా లోకేష్
-హేళన చెక్కిన శిల్పం వంటి వారు లోకేష్
-మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య
కంచికచర్ల మండలం : పరిటాల గ్రామం నందు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి పాదయాత్ర వందరోజుల పుట్టిన సందర్భంగా ఆయన పాదయాత్రకు సంఘీభావంగా వేల సంఖ్యలో తెదేపా శ్రేణులతో కలిసి సోమవారం నాడు పరిటాల సాయిబాబా గుడి వద్ద నుంచి కంచికచర్ల మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టిన మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య.
లోకమంతా మెచ్చిన నాయకుడు నారా లోకేష్.సహకరిస్తే పాదయాత్ర.. లేదంటే దండయాత్ర… అడ్డొస్తే తొక్కుకుంటా వెళ్లిపోతాం అన్న నారా లోకేష్ గారి మాటలు రాష్ట్రంలో ప్రతి ఒక్క తెలుగోడిని కదిలించాయి.రాష్ట్రమంతటా లోకేష్ వైపు చూస్తుంది. అన్ని వర్గాల ప్రజానీకం ఆయన అడుగులో అడుగును కలిపాయి, యువతకు ఆయన మాటే ఒక భవిత, భరోసా.
హేళన చెక్కిన శిల్పం వంటి వారు లోకేష్ ..అధికార పార్టీ నేతలు లోకేష్ గారి దేహ దారుఢ్యం గురించి ఆయన భాష గురించి ఎన్నో అవమానాలు చేసిన..ఎన్నో అవమానాలకు గురిచేసి తనపై తప్పుడుగా మాట్లాడుతూ విసిరేసిన ప్రతి రాయిని పునాదిరాళ్లుగా మలుచుకొని ఆయన పయనం కొనసాగింది.
ఈనాడు లోకేష్ మాట్లాడే తీరు ప్రశ్నించే విధానంతో అధికార పార్టీ నేతలకు కింద నుంచి పై వరకు వణుకు పుడుతుంది.అధికార పార్టీ నేతల గుండెల్లో నిద్రపోతున్న బెబ్బులి లోకేష్.పాదయాత్రలో ప్రతిరోజు అధికార పార్టీ నేతలు చేస్తున్న అరాచకాలు, అన్యాయాలు,అక్రమాలను ఎండగడుతున్న సుదీర్ఘ ఆలోచనశాలి లోకేష్.
36 నియోజకవర్గాలలో దాదాపు 1300 కిలోమీటర్లు దిగ్విజయవంతంగా పూర్తి చేశారు.400 రోజులలో 4000 కి.మీ,లక్ష్యంగా ఎండనక వాననక, పగలనకా రేయనకా అవిశ్రాంతంగా పోరాడుతున్న యోధుడు లోకేష్ . తన తల్లికి ఏదైతే అవమానం జరిగిందో, అదే చట్టసభలలో తన తండ్రిని ముఖ్యమంత్రిగా చేయడానికై లోకేష్ గారు పడుతున్న శ్రమకు మేమందరం అండగా ఉంటాము.యువగళం నూతన వాహనాన్ని ప్రారంభించడం సంతోషదాయకం.
పాదయాత్రకు సంఘీభావంగా రెండు రోజుల కాల వ్యవధిలోనే ఎండను సైతం లెక్కచేయకుండా విచ్చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పేరుపేరునా నా పాదాభివందనం. సహకరించిన పత్రిక మరియు మీడియా సోదరులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు.