– రెండు దశాబ్దాల తర్వాత గెలుపుతో పేటలో అంబరాన్నంటిన సంబరాలు
నరసరావుపేటలో తెలుగుదేశం గెలుపుతో ప్రజలు కార్యకర్తలు సంబరాలో మునిగితేలుతున్నారు.నరసరావుపేట పట్టణంలోని ఎన్జీవో కాలనీలో టీడీపీ మహిళల ఆధ్వర్యంలో కోలాటం అత్యంతం అలరించింది.కార్యక్రమానికి ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబును భారీ ర్యాలీగా ఆహ్వానించారు.
తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ప్రజలు కార్యకర్తలు ఏ స్థాయిలో ఎదురు చూశారో ఈ రోజు జరుగుతున్న సంబరాలు నిదర్శనమని ఆనందబాబు పేర్కొన్నారు.జగన్ రెడ్డి ఐదేళ్ల పాలన పై ప్రజల్లో గూడు కట్టుకున్న వ్యతిరేకత ఒక్కసారిగా బట్టబయలైందన్నారు. ప్రజలకు మేలు చేసే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు మాత్రమేనన్నారు.
జగన్ రెడ్డి పేదల ముసుగు తొడుక్కున్న అసలు సిసలైన పెత్తందారుడన్నారు.పేదలకు ఇల్లు కట్టించడం చేతకాదు గాని ఊరుకో ప్యాలెస్ కట్టుకుని తన పెత్తందారి పైత్యాన్ని బయటపెట్టాడని ఎద్దేవా చేశారు.జగన్ రెడ్డి లాంటి ఫ్యాక్షన్ పెత్తందారులను ప్రజలు ఎన్నటికీ క్షమించబోరని ఇకపై భవిష్యత్తు అంతా తెలుగుదేశం పార్టీతో మాత్రమే అన్నారు.రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం బాటలో పరుగులు పెట్టించి పరిపాలన అంటే ఇది అనేలా చేసి చూపిస్తామని ఆనందబాబు హామీ ఇచ్చారు.
నియోజకవర్గంలో ప్రతి ఒక్క పౌరుడికి రక్షణతో పాటు సంక్షేమ పథకాలతో భవిష్యత్తుకు భరోసా కల్పించి తీరుతామని ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కపిలవాయ విజయ కుమార్,సింహాద్రి యాదవ్,చిన్నప రెడ్డి తదితరులు పాల్గొన్నారు.