Suryaa.co.in

Andhra Pradesh

నారాయణ.. నారాయణ!

– సీఆర్‌డీఏపై పెత్తనం కోసం నారాయణ పోరు
– కాటమనేని భాస్కర్‌ను మార్చాలని సీఎంపై ఒత్తిళ్లు
– ఇద్దరికీ రాజీ చేసినా కుదరని సయోధ్య
– చివరకు కాటమనేనిని బదిలీ చేయాలని నిర్ణయం
– ఆయన స్థానంలో షన్‌మోహన్?
– కలెక్టర్ల సదస్సు తర్వాత బదిలీ?
(అన్వేష్)

సీఆర్‌డీఏపై తన ఒక్కరి పెత్తనమే సాగాలన్న మంత్రి నారాయణ లక్ష్యం నెరవేరనుంది. ఆయన కోరిక మరో రెండు రోజుల్లో ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సీఆర్‌డీఏపై నారాయణ కత్తికి ఎదురుండదన్నమాట.

మంత్రి నారాయణ-సమర్థుడు,నిజాయపరుడైన సీనియర్ ఐఏఎస్ అధికారి, కమ్మ సామాజికవర్గానికి చెందిన కాటమనేని భాస్కర్ మధ్య జరుగుతున్న అంతర్గత పోరులో, చివరాఖరకు నారాయణ నెగ్గేలా ఉన్నారు.

కాటమనేనిని తొలగించేందుకు మంత్రి నారాయణ గత కొద్దికాలం నుంచి చేస్తున్న ఒత్తిళ్లు ఎట్టకేలకూ ఫలించే సూచనలు కనిపిస్తున్నారు.కలెక్టర్ల సదస్సు తర్వాత భాస్కర్‌ను బదిలీ చేసి, ఆయన స్థానంలో షన్‌ మోహన్‌ను నియమించాలన్న నారాయణ ప్రయత్నం ఫలించనుంది.

వారిద్దరిమధ్య సయోధ్య కుదిర్చేందుకు సీఎం చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు. ఫలితంగా కాటమనేని బదిలీ వైపే బాబు మొగ్గుచూపినట్లు సమాచారం. సీఆర్‌డీఏపై తన ఒక్కరి పెత్తనమే సాగాలన్న మంత్రి నారాయణ లక్ష్యం నెరవేరనుంది. ఆయన కోరిక మరో రెండురోజుల్లో ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సీఆర్‌డీఏపై నారాయణ కత్తికి ఎదురుండదన్నమాట.

అమరావతి పనులను కొత్త ఏడాది నుంచి పరుగులు పెట్టించాలని చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి వీలుగా ఇప్పుడు గ్రౌండ్ అంతా ప్రిపేర్ అయిన తర్వాత.. అత్యంత కీలకమైన ఏపీసీఆర్‌డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్ ను బదిలీ చేయాలని సర్కారు నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ప్రపంచ బ్యాంకు ఒప్పందం తో పాటు, రాజధాని పనులు సాఫీగా సాగేందుకు అవసరమైన గ్రౌండ్ అంతా ఆయన సిద్ధం చేసి పెట్టారు. అయినా సరే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కు, కాటంనేని భాస్కర్ కు సఖ్యత లేనందు వల్ల, ఆ ప్రభావం పనులపై పడకుండా చూసేందుకు.. కాటంనేని భాస్కర్ ను కలెక్టర్ల సమావేశం ముగిసిన వెంటనే బదిలీ చేసే అవకాశం ఉంది అని చెబుతున్నారు.

ఆయన ప్లేసులో ప్రస్తుతం కాకినాడ కలెక్టర్ గా ఉన్న షాన్ మోహన్ ని నియమించేందుకు రంగం సిద్ధం అయినట్లు కూడా అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. షాన్ మోహన్ గతంలో సిఆర్డీఏ అదనపు కమిషనర్ గా పని చేశారు. దీంతో ఆయన అయితే తమకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది అని మంత్రి నారాయణ చేసిన వాదనకు ప్రభుత్వ పెద్దలు ఓకే చేసినట్లు చెపుతున్నారు.

గతంలో కూడా మంత్రి నారాయణ కు, కాటంనేని భాస్కర్ కు మధ్య పొసగటం లేదు అని..ఆయన్ను అక్కడ నుంచి తప్పించాలని చంద్రబాబు పై పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చినట్లు మీడియా లో వార్తలు వచ్చాయి. కానీ కారణాలు ఏమైనా అప్పటిలో ఆగిపోయినా బదిలీ ఈ సారి మాత్రం పక్కాగా జరుగుతుంది అని చెబుతున్నారు. అయితే భాస్కర్ ఏపీఐఐసీ ఎండీగా లేదా మరో పోస్ట్ లో నియమించే అవకాశం ఉంది అని అధికార వర్గాలు చెపుతున్నాయి.

మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ రూల్స్ కంటే కూడా కాంట్రాక్టు ల కేటాయింపుతో పాటు అన్నిటిలోనూ, తాను చెప్పినట్లు జరగాలి అనే తరహాలో వ్యవహరిస్తారు అని అధికార వర్గాలు చెబుతున్నాయి. గతంలో కూడా చాలా మంది అధికారులు ఆయన తీరుతో ఇబ్బంది పడ్డారు. అయినా సరే చంద్రబాబు దగ్గర ఉన్న పట్టుతో, అధికారుల బదిలీలు కూడా నారాయణ చేయించుకుంటున్నారు అనే ప్రచారం ఉంది.

తాజాగా ఎంఏయుడిలో తన సొంత సామాజికవర్గానికి చెందిన అధికారినే నారాయణ ఏరికోరి నియమించుకోవడం ప్రస్తావనార్హం. ఇప్పుడు మళ్లీ నిజాయితీపరుడు, ముక్కుసూటి అధికారి, రాత్రింబవళ్లు ఆఫీసులో కూర్చుని పనిచేసే భాస్కర్‌ను బదిలీ చేసేందుకు, రంగం సిద్ధం చేయడాన్ని సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. నారాయణ దగ్గర ఒక సామాజికవర్గం అధికారులకు మాత్రమే స్థానం ఉంటుందన్న ప్రచారం గతంలోనూ జరిగిన విషం తెలిసిందే.

కాగా కడప జిల్లా గాండ్ల సామాజికవర్గానికి చెందిన షన్‌మోహన్.. పైవారి ఆదే శాలు పాటించి, తనకు అప్పగించిన పనిని పూర్తి చేయడంలో సమర్ధుడైన అధికారిగా పేరుంది. కాటమనేని భాస్కర్ నిజాయతీపరుడైన అధికారి అయినప్పటికీ.. ముక్కుసూటిగా పనిచేస్తుంటారు. పని చేయిస్తారు కూడా. ప్రతిభ-పనితీరును ప్రాతిపదికగా తీసుకునే ఆయన పనితీరు మంత్రులకు రుచించదు. ఆయన కలెక్టరుగా పనిచేసిన అన్ని జిల్లాల్లో రాత్రివరకూ కలెక్టరేట్‌లోనే కొలువుదీరేవారు. మంత్రులు, ఎమ్మెల్యేల సిపార్సులు ఖాతరు చేయరు. అయితే రాజకీయ కోణంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకునే మంత్రి నారాయణకు.. బహుశా ఈ కారణాలతోనే , కాటమనేని సీఆర్‌డీఏలో కొనసాగడం నచ్చి ఉండకపోవచ్చని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

LEAVE A RESPONSE