నువ్వు మంత్రి వా? కంత్రివా? జగన్ రెడ్డి, పెద్దిరెడ్డిల బంట్రోతువా?
కొండేపి శాసనసభ్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి
అవినీతికి దత్తపుత్రుడు జగన్ రెడ్డి పంచన చేరి, పెద్ది రెడ్డి దగ్గర పెంపుడు కుక్కలా పడి ఉండే డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి చంద్రబాబు గారి కుటుంబంపై నోరెత్తే అర్హత లేదు. నారాయణ స్వామి పిచ్చి చేష్టలకు, పిచ్చి వాగుడుకి దళిత జాతి సిగ్గు పడుతోంది. పేరుకే డిప్యూటీ సీఎం పదవినిచ్చి అధికారం మొత్తం పెద్ది రెడ్డి చేతుల్లో పెట్టి చేవ చచ్చి చేతులు ముడుచుకున్న కూర్చున్న నువ్వు కూడా విమర్శించడం హేయం. నీ లాంటి నీతిమాలిన, బుద్ది లేని వ్యక్తి వలన దళితుల ఆత్మ గౌరవం దెబ్బతింటుంది.
కరోనా రావడానికి కారణం ముస్లీంలే అని ముస్లీం జాతిని అవమానించావు. జగన్ రెడ్డి, పెద్ది రెడ్డి సభల్లో కనీసం కుర్చీ మీద కూర్చునే ధైర్యం లేని నీ లాంటి వాళ్లు చంద్రబాబు గారి కుటుంబ సభ్యులపై మాట్లాడటం సిగ్గుచేటు. నువ్వు మంత్రి వా? కంత్రివా? లేదా పెద్దిరెడ్డి బంట్రోతువా? అని దళిత సంఘాలు నిలదీస్తున్నాయి. కుటుంబ సభ్యులను వాడుకొని రాజకీయం చేసే నీచ చరిత్ర నీ జగన్ రెడ్డిదే అని తెలుసుకో?
జగన్ రెడ్డి 16 నెలల పాటు జైళ్లో ఉన్నప్పుడు చెల్లిని, తల్లిని వాడుకొని రాజకీయ లబ్ది పొందాడు? నేడు అదే తల్లిని, చెల్లిని ఇంటి నుంచి గెంటివేసింది జగన్ రెడ్డి కాదా? సొంత బాబాయ్ ను చంపి, మరో చెల్లిని రోడ్డు పాలు చేసింది జగన్ రెడ్డి కాదా? కోడి కత్తి కేసును అడ్డంపెట్టుకొని రాజకీయ లబ్ది పొందాక ముద్దాయిని ముప్పు తిప్పలు పెడుతుంది జగన్ రెడ్డి కాదా?
తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని సంతకాలు సేకరించి ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నించిన నీచ సంస్కృతి జగన్ రెడ్డిది కాదా? హత్యా రాజకీయాలు, ఆడవాళ్లను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడాలు, కుటుంబ సభ్యులను హత్యలు చేయించడాలు, తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని సంతకాలు సేకరించడాలు వంటివి జగన్ రెడ్డికి తప్ప మరెవ్వరికి తెలియవు.
మద్యం శాఖా మంత్రిగా ఉన్న నారాయణ స్వామి నాశిరకం మద్యం పెంచి ప్రజల ప్రాణాలు హరించి మహిళల మంగల్యాలను తెంచే పనిలో నిమగ్నమయ్యారు. అసలు మద్య నిషేదం చేస్తేనే రాబోయే ఎన్నికల్లో ఓట్లు అడగమని చెప్పిన మీరు ఇప్పుడు ఏ మొఖం పెట్టుకొని ఎన్నికల్లోకి వెళతారు.