-మంత్రులు, వైసీపీనేతలతో ఇష్టమొచ్చినట్టు ఎవరు మాట్లాడిస్తున్నారో ప్రజలకు తెలుసు
• స్వర్గీయ ఎన్టీఆర్, చంద్రబాబునాయుడి కుటుంబాలను ఉద్దేశించి అనరాని మాటలనేవారు అసలు మనుషులేనా అన్న సందేహం కలుగుతోంది
• స్వర్గీయ ఎన్టీఆర్ మరణించింది 1996లో అయితే, చంద్రబాబు నాయుడు, భువనేశ్వరిల వివాహం జరిగింది 1981లో
• ఇంత చిన్న విషయం తెలియకుండానే నారాయణ స్వామి మతిలేకుండా మాట్లాడారా?
• పవిత్రమైన దేవాదాయశాఖ మంత్రిగా ఉన్న కొట్టుసత్యనారాయణ అసభ్యంగా మాట్లాడి అపవిత్రుడయ్యాడు
• చంద్రబాబుకి మద్ధతుగా భువనేశ్వరి, బ్రాహ్మణి చేపట్టిన నిరసన కార్యక్రమాలన్నీ విజయవంతం కావడంతో పాలకుల్లో భయం మొదలైంది
– మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి
జాతీయ నాయకుడు చంద్రబాబునాయుడికి మద్ధతుగా గళం వినిపిస్తున్న వారికి, ఆయన సతీమణి శ్రీమతి భువనేశ్వరికి, కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తూ, ధైర్యం చెప్పేవారికి చేతులెత్తి నమస్కరిస్తున్నామని, చంద్రబాబు త్వరగా బయటకు రావా లని, ఆరోగ్యంగా ఉండాలని దైవాన్ని ప్రార్థిస్తున్నవారికి కృతజ్ఞతలు తెలుపుతున్నా మని, చంద్రబాబు ఎప్పటికైనా కడిగిన ముత్యంలా బయటకువస్తారని, కానీ రాష్ట్రంలో మానవత్వం రోజురోజుకీ మంటగలిసిపోతుందనే బాధ కలుగుతోందని మాజీమంత్రి నన్నపనేని రాజకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే…
“ ముఖ్యమంత్రి, మంత్రులు, వైసీపీనేతల చంద్రబాబు, ఆయన సతీమణి శ్రీమతి భువనేశ్వరి, ఇతర కుటుంబసభ్యులు, స్వర్గీయ ఎన్టీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి వైసీపీ నేతలు, మంత్రులు మాట్లాడే తీరు చూస్తే వాళ్లు అసలు మనుషులేనా అనే సందేహం తోపాటు, చెప్పలేనంత అసహ్యం కలుగుతోంది.
స్వర్గీయ ఎన్టీఆర్ ఎప్పుడు చనిపోయారో, చంద్రబాబు-భువనేశ్వరిల వివాహం ఎప్పుడు జరిగిందో తెలియకుండానే నారాయణస్వామి మతిలేకుండా మాట్లాడారా?
ఉపముఖ్యమంత్రిగా ఉన్న నారాయణస్వామి అలా ఇంగితం లేకుండా మాట్లాడతారని అసలు ఊహించలేదు. ఆయన తనస్థాయిని మరిచి, విజ్ఞత కోల్పోయి మాట్లాడారు. ఆయన తనకు తానే మాట్లాడారా..లేక ఎవరైనా ఆయనతో మాట్లాడించారా? అర్థం తెలిసే ఆయన మాట్లాడారా? రాజకీయాల్లో నారాయణస్వామి ఎప్పటినుంచి ఉన్నా రు.. స్వర్గీయ ఎన్టీఆర్ కుటుంబం, చంద్రబాబు ఎప్పటి నుంచి ఉన్నారు. తండ్రిన చంపిన వ్యక్తిని భువనేశ్వరి పెళ్లి చేసుకుంది, తన భర్తను చంపడానికి ఆమే ఆహారంలో ఏదో కలుపుతోంది అనడానికి నారాయణస్వామికి నోరెలా వచ్చింది? ఎన్టీఆర్ గారు మరణించింది 1996లో అయితే, చంద్రబాబు నాయుడు, భువనేశ్వరిల వివాహం జరిగింది 1981లో. ఇంత చిన్న విషయం కూడా తెలియకుండానే నారాయణ స్వామి మతిలేకుండా మాట్లాడారా?
స్వర్గీయ ఎన్టీఆర్ మరణానికి కారకులెవరో, వారిని తమపార్టీలో చేర్చుకొని ఎన్టీఆర్ కుటుంబాన్ని, చంద్రబాబు కుటుంబాన్ని ఎవరు తిట్టిస్తున్నారో నారాయణస్వామికి తెలియదా?
స్వర్గీయ ఎన్టీఆర్ చనిపోవడానికి కారణం ఎవరో నారాయణస్వామికి, ఆయనతో మాట్లాడించే వారికి తెలియదా? స్వర్గీయ ఎన్టీఆర్ ఎప్పుడు చనిపోయారు.. చనిపోయే సమయంలో ఆయన పక్కన ఎవరున్నారు.. ఆయన చనిపోవడానికి ఏ మందులు వాడారు.. ఎలాంటి ఆహారం తిన్నారు…ఇంకా అనేక ప్రశ్నలకు ఇప్పుడు అధికారంలో ఉన్నవారికి సమాధానం తెలుసుకదా!
ఎవరైతే స్వర్గీయ ఎన్టీఆర్ మరణానికి కారకులో వారిని మీ పార్టీలోనే పెట్టుకొని, ఏదో పదవిచ్చి మరీ ఆమెతో ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్ని, చంద్రబాబుని, ఆయన కుటుంబాన్ని తిట్టిస్తున్నది మీరుకాదా? దేవాదా యశాఖ మంత్రిగా ఉన్న కొట్టుసత్యనారాయణ పవిత్రమైన పదవిలో ఉన్నాననే విషయం మర్చి, అపవిత్రంగా అసభ్యంగా మాట్లాడుతున్నాడు.
భువనేశ్వరిని కలవడానికి వెళ్లేవారిని అడ్దుకోవడం పాలకుల భయానికి నిదర్శనం. భువనేశ్వరి వ్యక్తిత్వం, మనస్తత్వం తెలిసిన వారు ఎవరూ ఆమెను తప్పుపట్టరు
చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని కలవడానికి వెళ్లేవారిపై ఈ ప్రభుత్వం ఎందుకు అంత కర్కశంగా వ్యవహరిస్తోంది. మాజీ మంత్రి కొల్లురవీంద్రను అన్యాయంగా అరెస్ట్ పేరుతో నిర్బంధిస్తారా? ఒకవైపు చంద్రబాబునాయుడి గురించి ఎవరూ ఆలోచిం చడం లేదంటారు.. మరోపక్క ఆయనకు మద్ధతుగా బయటకువచ్చేవారిని పోలీసుల సాయంతో అడ్డుకుంటారు. ఇదేనా మీ పాలన? భువనేశ్వరికి అండగా ఉండటానికి మేం ఆమెవద్దకు వెళ్లకూడదా? ఆమెకు ధైర్యం చెప్పకూడదా?
చెవులుండి వినలేని చెవిటి వాళ్లలా… కళ్లుండి చూడలేని కబోదుల్లా, మెదడు ఉండి మొద్దుబారిన పోయిన వాళ్లలా వైసీపీ నేతలు, మంత్రుల ప్రవర్తన ఉంది. చంద్రబాబునాయుడికి జైల్లో కనీస సౌకర్యాలు కల్పించకుండా వేధిస్తారా? ఆయనకు ఏసీ పెట్టాలంటే దాన్ని కూడా తప్పు పడతారా? భువనేశ్వరి ఎలాంటి మనిషో మాకు తెలుసు. ఆమె వ్యక్తిత్వం, హుందాతనం, అందరితో గౌరవంగా ప్రవర్తించే తీరు నిజంగా ప్రశంసనీయం.
భువనేశ్వ రిని ఒక్కమాటన్నా సహించేది లేదు. గతంలో లోకేశ్ ను ఇష్టమొచ్చినట్టు హేళన చేశారు. నేడు అదే వ్యక్తి మాటతీరు.. పనితీరు దెబ్బకి ఈ ప్రభుత్వమే భయపడుతోంది. కావాలనే యువగళం ఆపేయాలని, చంద్రబాబుని అడ్డుకోవాలని పథకం ప్రకారమే టీడీపీ అధినేతను అన్యాయంగా జైలుకు పంపారు. మొన్నటివరకు చంద్రబాబు, లోకేశ్ లను చూసి భయపడిన ప్రభుత్వం..నేడు భువనేశ్వరి, బ్రాహ్మణిలను చూసి బెంబేలెత్తు తోంది. భువనేశ్వరి, బ్రాహ్మణి పిలుపుతో చేపట్టిన మోతమోగిద్దాం.. కాంతితో క్రాంతి.. న్యాయానికి సంకెళ్లు వంటి కార్యక్రమాలు దిగ్విజయంగా విజయవంతం అయ్యాయి. అతివలైనా సరే మొక్కవోని ధైర్యంతో వారు ప్రజల్లో తీసుకొస్తున్న చైతన్యాన్ని చూసి ఓర్వలేకనే ఈ ప్రభుత్వం, మంత్రులు ఇష్టానుసారం పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు.
స్వర్గీయ హరికృష్ణ, భువనేశ్వరి అంటే స్వర్గీయ ఎన్టీఆర్ కు ఎనలేని ప్రేమాభి మానాలు. భువనేశ్వరిని భువనమ్మ అని ఎన్టీఆర్ ముద్దుగా పిలిచేవారు. భువనేశ్వరి హెరిటేజ్ సంస్థను, ఎన్టీఆర్ ట్రస్ట్ ను, ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ను, చూసుకుంటూ ఎంతో కష్టపడుతున్నారు. ఒక మానవతామూర్తిగా, గొప్ప తల్లిగా, భార్యగా, అత్తగా, గృహిణిగా, వ్యాపారవేత్తగా ఆమె బహుముఖపాత్ర పోషిస్తూ ఆదర్శ స్త్రీమూర్తిగా నిలుస్తున్నారు. తన తండ్రి స్థాపించిన పార్టీని, తన భర్తను, బిడ్డను కాపాడుకోవడం కోసం బయటకొచ్చిన మహిళను ఉద్దేశించి సభ్యతా, సంస్కారం మరిచి నీతిమాలిన వ్యాఖ్యలు చేస్తారా?
జగన్మోహన్ రెడ్డిలాగా జైల్లో రాజభోగాలు కావాలని చంద్రబాబు అడిగారా? కనీస సౌకర్యాలు కల్పించమని కోరడం కూడా తప్పేనా?
జగన్మోహన్ రెడ్డి జైల్లోఉన్నప్పుడు విలాసవంతమైన జీవితం గడిపారు, రాజభోగాలు అనుభవించారు. ఎప్పుడంటే అప్పుడు ఆయన కుటుంబసభ్యులు ఆయన్ని కలిశారు. అలాంటి స్వేచ్ఛ కావాలని మేంగానీ, ప్రజలు గానీ చంద్రబాబుకి ఇవ్వాలని కోరడం లేదే? కనీస సౌకర్యాలు కల్పించమంటే దానికే ఇష్టానుసారం మాట్లాడతారా? చంద్ర బాబునాయుడికి మద్ధతుగా ఎంతమంది ప్రపంచవ్యాప్తంగా గళం విప్పుతున్నారో ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కనిపించడంలేదా? చంద్రబాబు చేసిన మంచిపనులు.. ఆయన దూరదృష్టి వల్లే తాము నేడు ఉన్నతస్థానాల్లో ఉన్నామంటున్న యువత గళం మీకు వినిపించడంలేదా?
సభ్యత, సంస్కారం, బుద్ధి, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి, మంత్రులు, వైసీపీనేతలకు బుద్ధిచెప్పడానికి ప్రజలు ఎదురుచూస్తున్నారు
జైలు ప్రాంగంణంలో విలేకరులతో మాట్లాడటానికే జైలు అధికారులు.. వైద్యులు చెమట లు కక్కారు. అలాంటిది 40 రోజులుగా చంద్రబాబు జైల్లో ఎండధాటికి తీవ్ర ఇబ్బంది పడుతుంటే, ఆయన్ని మాటలతో అవమానిస్తారా? ఆయన కుటుంబసభ్యుల్ని అనరా ని మాటలంటారా? సభ్యత, సంస్కారం, బుద్ధి, జ్ఞానం లేకుండా మాట్లాడే వైసీపీనేతల కు, మంత్రులకు, ముఖ్యమంత్రికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారు.
జనం జగన్మోహన్ రెడ్డికి, ఆయన పరివారానికి శాస్తి చేయడం కోసం ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు విషయంలో జగన్ అనుసరిస్తున్న విధానాన్ని, కక్షసాధింపుల్ని, కుట్రల్ని ప్రజలు గ్రహిస్తున్నారని తెలుసుకోండి. ముఖ్యమంత్రి, సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు మాట్లాడేముందు నోరు అదుపులో పెట్టుకోవాలి.” అని రాజకుమారి హితవుపలికారు.