-చర్చి శంకుస్థాపన లో పాల్గొన్న ఎమ్మెల్యే.
-చర్య తీసుకోవాలని ఎన్నికల సంఘానికి బిజెపి ఫిర్యాదు
నారాయణఖేడ్ ఎమ్మెల్యే ఓట్ల కోసం క్రైస్తవులను ప్రలోభ పెట్టేందుకు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారు. నారాయణఖేడ్ లో చర్చిని నిర్మించి ఇస్తామని స్వయంగా భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల కోడ్ కు ముందు రోజు వరకు వివిధ కుల సంఘాల భవనాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోడ్ ప్రారంభ మయ్యక కూడా ప్రలోభ పెట్టే కార్యక్రమాలను కొనసాగిస్తున్నారని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి జెనవాడే సంగప్ప దుయ్యబట్టారు. బిజెపి , వివిధ ప్రతిపక్ష పార్టీల నాయకులు బిజెపి స్టేట్ కౌన్సిల్ మెంబర్ మారుతి రెడ్డి ఆధ్వర్యం లో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.