Suryaa.co.in

Andhra Pradesh Telangana

ఏపీ అభివృద్ధికి కోటి విరాళం ఇచ్చిన నార్నె శాంతారావు

హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త నార్నె రంగారావు సతీమణి నార్నె శాంతారావు ఏపీ రాష్ట్ర అభివృద్ధి కోసం కోటిరూపాయల చెక్కును, సీఎం చంద్రబాబునాయుడుకు అందించారు. రాష్ట్రాభివృద్ది కోసం అహర్నిశలు కృషి చేస్తున్న బాబుకు, భగవంతుడు మరింత శక్తి ఇవ్వాలని ఆకాంక్షించారు.

బాబు బ్రాండ్ ఇమేజీనే ఏపీకి శ్రీరామరక్ష అన్నారు. బాబు నాయకత్వంలో రాష్ట్రం దేశంలోనే నెంబర్‌వన్ రాష్ట్రంగా మారుతుందన్నారు. ఈ సందర్భంగా తాము పెంచుతున్న వివిధ రకాల మొక్కలను ఆమె సీఎంకు అందించారు. వాటి ప్రాముఖ్యతను వివరించారు.

కాగా రాష్ట్రాభివృద్ధి కోసం ఏపీకి చెందిన పారిశ్రామికవేత్తలు విరాళాలివ్వాలని, ప్రతి ఒక్కరు నార్నె శాంతారావును ఆదర్శంగా తీసుకోవాలని టీడీపీ తెలంగాణ తెలుగుమహిళ మాజీ రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి పిలుపునిచ్చారు. జన్మభూమి రుణం తీర్చుకునేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరారు.

రాష్ట్రాభివృద్దిపై శ్రద్ధ, చిత్తశుద్ధితో కోటిరూపాయల విరాళం ఇచ్చిన శాంతారావుకు సీఎం చంద్రబాబునాయుడు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంపై ఆమె అంకితభావం, చిత్తశుద్ధిని అభినందించారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబ విశేషాలు, మొక్కల పెంపకం గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు. ఏయే శీతోష్ణస్థితిలో ఆ మొక్కలు పెరుగుతాయని ఆరా తీశారు. ఇలాంటివి అమరావతిలో కూడా పెంచాలని బాబు సూచించారు. ఈ కార్యక్రమంలో అడుసుమిల్లి నరేష్, అడుసుమిల్లి దీప పాల్గొన్నారు.

LEAVE A RESPONSE