రుషికొండ తవ్వకాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు తవ్వకాలు జరపరాదని ఆదేశించింది. వైకాపా ఎంపీ రఘురామకృష్ణ రాజు వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఎన్జీటీ.. ఇప్పటివరకు జరిగిన తవ్వకాలపై అధ్యయనానికి సంయుక్త కమిటీని నియమించింది. ఏపీ కోస్టల్ మేనేజ్‌మెంట్ అథారిటీ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని పేర్కొంది. నెల రోజుల్లో కమిటీ నివేదిక అందించాలని ఆదేశించింది.