October 3, 2026

బీసీ రిజర్వేషన్ల కోసం దేశవ్యాప్త ఉద్యమం

  • కులగణన చేపట్టి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి
  • జీఓ ప్రతులను చించివేసి నిరసన
  • మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్: బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడంతో పాటు సమగ్ర కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా ఓబీసీ ప్రజా ప్రతినిధుల ఫోరం పిలుపు మేరకు హైదరాబాద్ గన్‌పార్క్ వద్ద బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం, బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం కన్వీనర్ చిరంజీవులు గారు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ తదితరులు పాల్గొని జీఓ ప్రతులను చించివేసి నిరసన తెలపడం జరిగింది.

మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ….. స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 80 సంవత్సరాలు గడిచినా బీసీలకు సామాజిక న్యాయం పూర్తిస్థాయిలో అందలేదన్నారు. విద్య, ఉద్యోగాలు, రాజకీయ రంగాల్లో బీసీలు ఇప్పటికీ వెనుకబడి ఉన్నారని తెలిపారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటే సరైన కులాల గణాంకాలు అవసరమని, సమగ్ర కులగణన లేకపోవడం వల్ల రిజర్వేషన్లకు న్యాయపరమైన సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు.

1931లో బ్రిటిష్ ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టిందని, స్వాతంత్ర్యం అనంతరం బీసీల సమగ్ర కులగణనను నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ వర్గాలకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా, కులవృత్తులకే పరిమితం చేసి రాజ్యాధికారంలో తగిన వాటా, విద్యా-ఉద్యోగాల్లో సముచిత రిజర్వేషన్లు కల్పించలేదని అన్నారు. స్సీ, ఎస్టీల మాదిరిగానే బీసీలకు కూడా సమగ్ర కులగణన చేపట్టాలని, కులగణనలో ఎలాంటి తప్పులు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో బీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించినప్పుడే బీసీలకు నిజమైన న్యాయం జరుగుతుందని అన్నారు.

బీసీ రిజర్వేషన్ల కోసం దేశవ్యాప్తంగా ఉద్యమం కొనసాగుతోందని, అన్ని రాజకీయ పార్టీలు ఈ డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించేందుకు పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ల బిల్లును తీసుకురావాలని, అవసరమైతే పార్లమెంటును స్తంభింపజేసి ఉద్యమించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు వట్టే జానయ్య యాదవ్ ,బీసీ పొలిటికల్ ఫ్రెంట్ వైస్ చైర్మన్ ఎస్ దుర్గయ్య గౌడ్,రాష్ట్ర కన్వీనర్లు అయిలి వెంకన్న గౌడ్, ఎర్ర సత్యనారాయణ, బైర శేఖర్, అంబాల నారాయణ గౌడ్, బార్ & రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షులు దామోదర్ గౌడ్, లింగేష్ యాదవ్, నీరజ గౌడ్, సుదర్శన్ నేత తదితరులు పాల్గొన్నారు.

Total Visitors: 2,854,739