– రైతులకు బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి
– రైతు భరోసా అందించాము
– ఖమ్మం జిల్లా బోనకల్లు ఎంపీడీవో కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ కు హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
ఖమ్మం: ఈ సీజన్లోనూ ప్రకృతి మన రాష్ట్రంపై కరుణ చూపించింది. గత సీజన్ మాదిరిగానే పెద్ద ఎత్తున ఆహార ఉత్పత్తులు సాధించి దేశంలోనే తెలంగాణ ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభం కాగానే రైతు భరోసా నిధులు జమ చేశాం. సీజన్ ప్రారంభంలో వర్షాలు కాస్త నెమ్మదించిన ప్రస్తుతం విస్తృతంగా వర్షపాతం నమోదవుతుంది, రైతులు పంటలపరంగా ఇబ్బంది లేదని డిప్యూటీ సీఎం అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల యూరియా కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం మూలంగా క్రమంగా ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుందని డిప్యూటీ సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. కలెక్టర్లు జిల్లాల్లో జాగ్రత్తగా సమన్వయం చేసుకుంటే యూరియా సమస్యను అధిగమించవచ్చని డిప్యూటీ సీఎం తెలిపారు.
బ్యాంకులు కూడా సకాలంలో రైతులకు వ్యవసాయ రుణాలు అందిస్తున్నాయి, విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ సరఫరాకు మండలాల వారిగా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు సీఎం తెలిపారు.
10 సంవత్సరాలుగా పంపిణీకి నోచుకోని రేషన్ కార్డులు ప్రస్తుతం పెద్ద సంఖ్యలో రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుండడంతో సర్వత్ర ఆనందం వ్యక్తం చేస్తున్నారని డిప్యూటీ సీఎం తెలిపారు. రాష్ట్రంలో 93 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం అందుతున్నాయని తెలిపారు.
వర్షాకాలం సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున కలెక్టర్లు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో సందర్శించి, HOD లకు టార్గెట్లు ఫిక్స్ చేస్తే సీజనల్ వ్యాధులను అధిగమిస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు.
నాగార్జునసాగర్ కు వరద నీరు చేరుతుంది, నాగార్జునసాగర్ కు పైన ఉన్న ప్రాజెక్టులన్ని నిండుగా ఉన్నాయని, గోదావరి పరివాహక ప్రాంతంలో ఎప్పుడు కూడా జూలై చివర్లోనే నీటి ప్రవాహాలు కనిపిస్తాయి అని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి యావత్ క్యాబినెట్ ఆకాంక్షల మేరకు అధికారులు దృష్టి పెట్టి పనిచేస్తే మంచి ఫలితాలు సాధిస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు.