ఓ వైపు రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా.. మరోవైపు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ అభ్యర్థిగా జగదీప్ ధన్కర్ నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లు వెంట రాగా…. పార్లమెంటు ఆవరణలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ధన్కర్ నామినేషన్ దాఖలు చేశారు.
నిన్నటిదాకా పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా కొనసాగిన ధన్కర్ ను ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ పదవికి ధన్కర్ రాజీనామా చేయగా… దానిని వెంటనే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోందించారు. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలోకి దిగేందుకు ఆయనకు మార్గం సుగమం అయ్యింది. వచ్చే నెల 6న ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన పోలింగ్ జరగనుంది.
NDA Vice Presidential candidate Shri Jagdeep Dhankar files nomination. https://t.co/NkW45MBXHK
— BJP (@BJP4India) July 18, 2022