Suryaa.co.in

Andhra Pradesh

నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలి

– ఎస్ఎఫ్ఐ డిమాండ్

ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే వైద్య విద్య ప్రవేశ పరీక్ష నిర్వహించుకునేందుకు చర్యలు తీసుకోవాలి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మాగులూరి కిరణ్ డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష నిర్వహణపై వచ్చిన ఆరోపణల పై సమగ్ర విచారణ చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో గురువారం చంద్రమౌళి నగర్ నుండి లక్ష్మీపురం మధర్ థెరిస్సా విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించి, నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మాగులూరి కిరణ్ మాట్లాడుతూ నీట్ పరీక్ష నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టి ఏ) ని వెంటనే రద్దు చేసి, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వైద్య విద్య ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇటీవల నీట్ ఫలితాలు భారతదేశంలోని విద్యార్థులందరిని ఆశ్చర్యానికి గుర్తు చేశాయని, 68 మంది విద్యార్థులు మొదటి ర్యాంకు పొందటం, గ్రేస్ మార్కులు ఇంప్లిమెంటేషన్ చేయటం, జూన్ 14న విడుదల చేయాల్సిన నీట్ ఫలితాలను జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ రోజున రిజల్ట్ ఇవ్వడం చూస్తుంటే ఇవన్నీ నీట్ పరీక్ష సరిగ్గా నిర్వహించలేదనే సందేహాలకు అద్దం పడుతున్నాయని ఆయన అన్నారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశంలో వైద్య విద్య ప్రవేశాల కోసం జరుగుతున్న ఇటువంటి పరీక్షలలో పేపర్ లీకేజ్ అయిందని ఆరోపణలు, దానికి అనుగుణంగా ఇటువంటి పరిణామాలు ఎంబిబిఎస్ చదవాలనే విద్యార్థులను వారి తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని, నేడు నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని విమర్శించారు. కేంద్రం పెత్తనం చేసేందుకు మాత్రమే నీట్ పరీక్షను దేశవ్యాప్తంగా ఒకే సారి ఒకే పరీక్ష నిర్వహిస్తుందని, రాష్ట్రాల పరిధిలో పరీక్షలు నిర్వహించినట్లయితే ఇటువంటి లోపాలు జరగే అవకాశం తక్కువని, జరిగినా ఆ రాష్ట్రానికి మాత్రమే పరిమితం అవుతాయని, ఇవేమీ పట్టని కేంద్ర ప్రభుత్వం తన పెత్తనం కోసం నీట్ పరీక్షను నిర్వహిస్తూ దానిలోని లోపాలను సరి చేయకుండా పేపర్ లీకేజీలు, పరీక్షా ఫలితాల్లో అనేక అవకతవకలు జరగటం దేశ భవిష్యత్తుకు చాలా ప్రమాదమని ఆయన అన్నారు.

సుప్రీంకోర్టు సైతం నీట్ ఎగ్జామ్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని, వాటిని అంగీకరించాలి అని సూచించినా ఇంతవరకు నీట్ పరీక్షను రద్దు చేయకపోవడం కేంద్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని, వచ్చే విద్యా సంవత్సరం నుండి ఆయా రాష్ర్ట ప్రభుత్వాలే వైద్య విద్య ప్రవేశ పరీక్ష నిర్వహించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇప్పటికే తమిళనాడు, కేరళ, మరికొన్ని రాష్ట్రాలు నీట్ రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించుకుంటామని ఆందోళన చేస్తున్నా పట్టించుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వైద్య విద్య ప్రవేశ పరీక్ష మన రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షురాలు టి.సుచరిత, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి సుభాష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు యశ్వంత్, షంషిద్, ఎస్ఎఫ్ఐ నాయకులు మరియు విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇట్లు
ఎం. కిరణ్
జిల్లా కార్యదర్శి
ఎస్ఎఫ్ఐ
9705748318

LEAVE A RESPONSE