న్యూఢిల్లీ, మార్చి 14: నౌకా దళానికి సహాయకారిగా ఉండే అయిదు నౌకల నిర్మాణానికి సంబంధించి హిందుస్తాన్ షిప్ యార్డ్ (హెచ్ఎస్ఎల్)తో చర్చలు పురోగతిలో ఉన్నట్లు రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ తెలిపారు. రాజ్యసభలో సోమవారం విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ అయిదు నౌకల నిర్మాణానికి సంబంధించిన డిజైన్, నిర్మాణానికి సంబంధించి హెచ్ఎస్ఎల్ భాగస్వామితో ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు మంత్రి తెలిపారు. దీనికి సంబంధించిన చర్చలు ప్రస్తుతం పురోగతిలో ఉన్నందున దీనిపై ఇంతకంటే వివరాలు తమ వద్ద వివరాలు లేవని చెప్పారు.