నెపో కిడ్స్. అంటే బలిసినోళ్ళ పిల్లలు. . నేపాల్ లో అల్లర్లకు ఇది కూడా ఒక కారణం. . గత సంవత్సరం ఇదే రోజు నేను పెట్టిన పోస్ట్ . తల్లిదండ్రులు అండ చూసుకుని కన్ను మిన్నూ కానరాకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తే, జనంలో ఏహ్యభావం కలుగుతుంది. . సామాజిక సమతుల్యత దెబ్బ తింటుంది . అభిలషణీయం కాదు . గత సంవత్సరం పోస్ట్ చదవండి .
ఫిర్యాదుదారుడే తన స్టేటుమెంటుని మార్చుకుంటే కోర్టు ఏం చేయగలదు ? ప్రాసిక్యూషన్ మాత్రం ఏం చేయగలదు ?! ఈ కేసు పూర్వాపరాలు ఏమిటంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని ఇండోర్ నగరంలో 2019 లో మునిసిపల్ కార్పోరేషన్ బిల్డింగ్ ఇనస్పెక్టర్ బయాస్ అనే ఉద్యోగిని రాష్ట్ర మంత్రి కైలాష్ విజయవర్గీయ అనే భా జ పా నాయకుడి కుమారుడు ఆకాష్ విజయవార్గీయ బిపి పెరిగి క్రికెట్ బాటుతో కుమ్మేసాడు .
ఆ బిల్డింగ్ ఇనస్పెక్ఠర్ పోలీసు స్టేషన్లో కేసు పెట్టాడు . పోలీసులు IPC 353 , 294 , 323 , 506 , 147 , 148 సెక్షన్ల కింద కేసు పెట్టి అరెస్ట్ చేశారు . నిందారోపణ చేయబడిన వారందరూ నేరం చేసిన వారు కాదు . నేరం రుజువయ్యే దాకా కేవలం చవితి చంద్రుడిని చూసి అపనిందల పాలు అయినవారి కిందే పరిగణించాలి . న్యాయం కూడా. .
అలాగే కోర్టు సదరు నేరారోపితుడికి బెయిల్ ఇవ్వటం జరిగింది . ఇప్పుడు విచారణకు వచ్చింది . కోర్టు విచారణలో తనను ఎవరో కొట్టారో చూడలేదని స్టేటుమెంట్ ఇచ్చారు . ప్రాసిక్యూషన్ వారు మాత్రం ఏం చేయగలరు ? కోర్టు మాత్రం ఏం చేయగలదు ? సదరు నాయకుడిని నేరం చేయలేదు కాబట్టి కేసు నుండి విడుదల చేశారు . ఇదంతా గిట్టని కాంగ్రెస్ నాయకులు ఆఫీసర్ ని భయపెట్టి స్టేటుమెంటుని మార్పించారని గగ్గోలు పెడుతున్నారు . ఆ ఆఫీసర్ మీద స్టేటుమెంట్ మార్చినందుకు కేసు పెట్టాలని కేకలు పెడుతున్నారు .
డబ్బు , అధికారం ఉన్న పెద్దోళ్ళ కేసులన్నీ ఇలాగే ఉంటాయి . ఫిర్యాదు చేసిన వారు స్టేటుమెంట్లు మార్చుకుంటారు . లేదా కొన్ని కేసుల్లో ప్రాసిక్యూషన్ అంటే పోలీసులు సాక్ష్యాలను కోర్టులో ప్రవేశ పెట్టలేకపోవటం వలన కేసులు కొట్టివేయబడతాయి . పోలీసులు సాక్ష్యాలను సేకరించలేకపోతే ప్రాసిక్యూటర్ ఏం చేయగలడు ? కోర్టులో కేసు పెట్టిన పోలీసులు , ప్రాసిక్యూషన్ వారు తమ కేసులను తామే ఘట్టిగా వాదించుకోలేకపోతే కోర్టులు ఏం చేయగలవు ?
జనం ఏం చేయగలరు ? సినిమాలలో పాటలు ఉంటాయి . చట్టానికి కళ్ళు లేవు తమ్ముడూ అంటూ పాటలు పాడుకోవటమే . డబ్బున్న వారి విషయంలో , రాజకీయుల విషయంలో ఎక్కువగా జరిగేది ఇదే . కల్కి రావాల్సిన టైం వచ్చేసింది . 2898 దాకా ఆగాల్సిన అవసరం లేదు . కృతయుగం రావటానికి ఉవ్విళ్లూరుతుంది .
-ప్రొఫెసర్ డిఏఆర్ సుబ్రమణ్యం