వైసీపీ నాయకుడు, మాజీ ఎంఎల్ ఏ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పినెల్లి వెంకటరామిరెడ్డిపై నమోదైన డబుల్ మర్డర్ కేసు (ఇద్దరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల హత్య)కు సంబంధించి సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
కేసు వివరాలు:
నిందితులు (పినెల్లి సోదరులు): తమ కేసు డైరీని “సందేహాస్పద రీతిలో” యాక్సెస్ చేశారని, అంటే దర్యాప్తు వివరాలు వారికి అక్రమంగా లభించాయని కోర్టు దృష్టికి వచ్చింది.
న్యాయమూర్తి (జె. మెహతా): ఈ విషయంపై తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశారు. “మీరు [జైలుకు] తిరిగి వెళ్లండి. మీకు కస్టోడియల్ విచారణ అవసరం… ఈ దశలో నిందితుడికి కేసు డైరీ ఎలా చేరింది? అంగీకరించలేము (UNACCEPTABLE!)” అని వ్యాఖ్యానించారు.
కోర్టు అభిప్రాయం: కేసు డైరీ అందుబాటులోకి రావడం “సాదాసీదాగా ట్యాంపరింగ్” అని, నిందితులకు అది పళ్లెంలో పెట్టి అందించబడిందని న్యాయమూర్తి పేర్కొన్నారు.
తీర్పు: పినెల్లి సోదరులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేయబడ్డాయి. నిందితులు రెండు వారాల్లో కోర్టుకు లొంగిపోవాలని ఆదేశించింది.
ఈ కేసులో పినెల్లి సోదరుల తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ్ దేవ్, షోయబ్ ఆలం వాదించారు. అయితే, కోర్టు కేసు డైరీ లభించిన తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. క్రింది కోర్టులో కేసు డైరీల విషయాలు తెలుసుకొని మరీ వచ్చి సుప్రీంకోర్టులో మెట్టు దెబ్బలు తిన్నారు, ఈ డబుల్ మర్డర్ పిన్నెల్లి బ్రదర్స్.
ఇప్పుడు జైలుకి పోకతప్పదు! ఇలాగే తమ వైకాపా పాలనలో అగ్రిగోల్డ్ భూముల వరకు తిన్నది అరక్క, కూటమి పాలనను బద్నాం చెయ్యడానికి, జనార్దన్ రావును పావుగా చేసుకొని కల్తీ మద్యంకు కుట్రపన్ని అడ్డంగా దొరికి జైల్లో ఉన్నారు జోగి బ్రదర్స్. చూస్తుంటే జంటలు జంటలుగా.. గుంపులు గుంపులుగా బొక్కలోకి పోవడం కొత్త ట్రెండ్ అనిపిస్తోంది. ఏది ఏమైనా సింగిల్ సింగం పార్టీలో నాయకులు పోతూ పోతూ ఔట్ చేసుకొని టీమ్ మొత్తాన్ని తీసుకు వెళుతున్నారు. కెప్టెన్ జగన్ మాత్రం తెలివిగా ములాఖాత్ లు కూడా మానేసి, కేవలం పెళ్లిళ్లలో రఫ్ఫా రఫ్ఫా ఈవెంట్స్ చేసుకుంటూ పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తున్నారు.

