కక్ష సాధింపులే లక్ష్యంగా జగన్ రెడ్డి నాలుగేళ్ల పాలన
జగన్ రెడ్డి అరాచకాన్ని నిరసిస్తూ టీడీపీ నేతలు సర్వమత ప్రార్థనలు
రాష్ట్రంలో అభివృద్ధి, ప్రజల జీవితాల్లో అభ్యున్నతి లేని ఏకైక రాష్ట్రంలా ఆంధ్రప్రదేశ్‌ను జగన్ రెడ్డి తయారు చేశారు. నాలుగేళ్లుగా కక్ష సాధింపులు, దాడులు, దౌర్జన్యాలతోనే జగన్ రెడ్డి పాలన సాగింది. పరిశ్రమలు తరిమేసి, పెట్టుబడులు దూరం చేసి రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేసిన ఘనత జగన్ రెడ్డికే దక్కింది. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో రూపాయి అవినీతి నిరూపించలేక ఆపసోపాలు పడుతున్న జగన్ రెడ్డి.. చంద్రబాబును అరెస్టు చేయడం ముమ్మాటికీ కక్ష సాధింపే.
తండ్రి అధికారాన్ని వాడుకుని లక్షల కోట్లు దోచుకుతిన్న జగన్ రెడ్డి, అందరూ తనలాగానే వ్యవహరిస్తారు అనేలా అనుకోవడం సిగ్గుచేటు అని తెలుగుదేశం పార్టీ నేతలు హోరెత్తారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ 28వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలు, చర్చిలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. చంద్రబాబు ఆయురారోగ్యాలతో బయటకు రావాలని కోరుకుంటూ పూజలు నిర్వహించారు.
ఏలూరు జిల్లా జి.కొత్తపల్లిలో గోపాలపురం ఇంఛార్జి మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో శాంతియుత ఆందోళన చేపట్టారు. రేపల్లె నియోజకవర్గంలో శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ ఆదేశాలు మేరకు తెలుగు యువత ఆధ్వర్యంలో మోర్తోట ముక్తేశ్వర ఆలయం వద్ద కృష్ణా నదిలో జలదీక్ష చేపట్టారు.దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం అప్పనవీడులో చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో అభయ అంజనేయ స్వామి దేవాలయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాబుతో నేను కరపత్రాలను అందజేశారు.
శృంగవరపుకోట నియోజకవర్గం లక్కవరపుకోట మండలం, ఖాసాపేటలో కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో బంగారమ్మ తల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం మాజీ ఎమ్మెల్యే పప్పల చలపతిరావు, యలమంచిలి నియోజకవర్గ ఇంచార్జి ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రిలే దీక్ష చేపట్టారు. కర్నూలు పట్టణం నందికొట్కూరు రోడ్డులో గల వరసిద్ధి వినాయకుని ఆలయంలో గౌరు చరిత వెంకట రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు, అర్చన చేయించారు.
రాజానగరంలో సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో బొడ్డు వెంకటరమణ చౌదరి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఉంగుటూరు నియోజకవర్గ కేంద్రంలో ఏలూరు జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులుగారు, జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రెడ్డీ సూర్యచంద్రరావు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అనంతరం దీక్షా శిభిరం నుండి చల్లాలమ్మ గుడి వరకు పొర్లు దండాలు చేశారు. అనకాపల్లిలో పీలా గోవింద సత్యన్నారాయణ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర ఇలవేల్పు నూకాంబికా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
అన్నమయ్య జిల్లా, రాయచోటిలో ఆర్ రమేష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక చర్చి, దర్గా మరియు సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు, దువా, పూజలు చేపట్టారు. పీలేరు టౌన్ తిరుపతి రోడ్డు చౌడేశ్వరి దేవి ఆలయంలో మండలం తెలుగుదేశంపార్టీ నాయకులు ప్రత్యేక పూజలు చేపట్టారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ముత్యాలంపాడు శివాలయంలో పోలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ప్రత్యేక పూజలు చేపట్టారు. న్యాయం జరగాలని ఆకాంక్షిస్తూ 116 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గుంతకల్లు నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు జితేంద్ర గౌడ్ ఆదేశాల మేరకు వినాయక స్వామి ఆలయంలో రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి పవన్ కుమార్ గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేయించి, వినూత్న రీతిలో ఆలయం చుట్టు మోకాళ్లపై నడిచి, గుంజీలు తీస్తూ నిరసన తెలిపారు. నరసన్నపేట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి దంపతులు మబగాం గ్రామంలోని శ్రీశ్రీశ్రీ చిన్నమ్మ తల్లి, తూర్పుఅమ్మ తల్లి దేవతలకు సన్నాయి మేళాలతో పెద్ద ఎత్తున ఊరేగింపుగా వెళ్లి మురాటలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
తెనాలి పట్టణంలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ అధ్వర్యంలో చిట్టి ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రే ఫర్ బాబు అనే కార్యక్రమంలో భాగంగా పూజ నిర్వహించడం జరిగినది. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఆలయంలో నియోజకవర్గ ఇంచార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి ప్రత్యేక పూజలు జరిపించారు. మదనపల్లి నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇంచార్జి దొమ్మలపాటి రమేష్ గారి ఆధ్వర్యంలో శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 101 కొబ్బరికాయలు కొట్టారు.
గుంతకల్లు పట్టణంలో మాజీ శాసనసభ్యులు ఆర్.జితేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. నెల్లూరులో మాజీమంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు టీడీపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో తెలుగుమహిళలు నగరంలోని శ్రీరాజరాజేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. అమ్మవారికి కైంకర్యాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. అనంతరం దేవస్థానం ఎదుట టెంకాయలు కొట్టారు.
మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 101 కొబ్బరికాయలు కొట్టారు. రాజమండ్రి టి.నగర్ శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో ( జోడు గుళ్లో ) రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతపురం అర్బన్ టిడిపి సీనియర్ నాయకుడు కేఎం జఖీఉల్లా గారి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. అనంతరం తలకిందులుగా నిలబడి నిరసన తెలుపుతూ రివర్స్ పాలనలో రాష్ట్రం రివర్స్ గేర్ లో నడుస్తోందంటూ నినదించారు. అనపర్తి నియోజకవర్గo పెదపూడి మండలం కైకవోలు జీసస్ హోమ్ చర్చ్‌లో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.
చీరాలలో తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఎం.ఎం. కొండయ్య ఆధ్వర్యంలో మార్క్స్ లూథరన్ చర్చి లో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో మాజీ శాసన మండలి సభ్యులు బుద్ధ నాగ జగదీశ్వరరావు, చోడవరం నియోజకవర్గం ఇన్చార్జి బత్తుల తాతయ్య బాబు ఆధ్వర్యంలో మశీదులో నమాజ్ చేశారు. మచిలీపట్నం నియోజకవర్గంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శి, పి.వి.ఫణి కుమార్, మచిలీపట్నం నగర కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి, పిప్పళ్ళ వెంకట కాంతారావు ఆధ్వర్యంలో నేతలు తల కిందులుగా నిలబడి నిరసన తెలిపారు.
కొత్తపేట నియోజకవర్గలో బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో రావులపాలెం పార్టీ ఆఫీస్ నుంచి మారుతీ నగర్‌లోని శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయం వరకు పాదయాత్రగా వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మడకశిర నియోజకవర్గ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో వడుసలమ్మ దేవికి 101 కుండలతో పాదయాత్రగా వెళ్లి వడుసలమ్మ దేవికి అభిషేకం చేసి 101 టెంకాయలు కొట్టి మొక్కుకున్నారు.
జగ్గంపేట నియోజకవర్గంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో కృష్ణునిపాలెం పరిశుద్ధ దేవాలయంలో పాస్టర్స్ జుహాని హలోనెన్, ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. మంగళగిరి పట్టణంలో అధ్యక్షులు దామర్లరాజు ఆధ్వర్యంలో లక్ష్మినరసింహాస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణ కార్యదర్శి నల్లగొండ పరమేశ్వరరావు గుడి చుట్టూ మోకాళ్ళపై ప్రదక్షిణలు చేశారు.
ఈ సర్వమత పార్థనలలో పోలిట్ బ్యూరో సభ్యులు గుమ్మడి సంధ్యారాణి, బొండా ఉమామహేశ్వరరావు, గోరంట్ల బుచ్చియ్య చౌదరి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పార్లమెంట్ అధ్యక్షులు కూన రవికుమార్, బుద్దా నాగజగధీశ్వరరావు, పల్లా శ్రీనివాసరావు, గన్నీ వీరాంజనేయులు, జె.ఎస్ జవహార్, తెనాలి శ్రావణ్ కుమార్, జీవీ ఆంజనేయులు, గొల్లా నరసింహాయాదవ్, మాజీ మంత్రులు కిడారి శ్రావణ్, కిమిడి కళా వెంకట్రావు, కొండ్రు మురళీమోహన్, గంటా శ్రీనివాసరావు, గొల్లపల్లి సూర్యరావు, దేవినేని ఉమా, కన్నా లక్ష్మినారాయణ, ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, వెలగపూడి రామకృష్ణబాబు, పి.జి.వి.ఆర్ నాయుడు (గణబాబు), వేగుళ్ళ జోగేశ్వరరావు, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, గద్దె రామ్మోహన రావు, గొట్టిపాటి రవి, డోలా బాలవీరాంజనేయస్వామి, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, రాష్ట, మండల నాయకులు పాల్గొన్నారు.