పాలకొండ నియోజకవర్గం జనసిన అభ్యర్ధిగా నిమ్మక జయకృష్ణను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చేశారు. ఎస్టీలకు రిజర్వు చేసిన పాలకొండ నియోజకవర్గం నుంచి మిత్రపక్షాల అభ్యర్ధిగా జయకృష్ణ బరిలో నిలవనున్నారు. ఈ నియోజకవర్గం నుంచీ టికెట్ కోసం ఆశావహులు ఎక్కువగా ఉండి పోటీపడడంతో పలు దఫాలుగా జనసేన పక్షాన సర్వేలు జరిగాయి. ఈ సర్వేలో జయకృష్ణకు అత్యధికంగా ప్రజల మద్దతు లభించడంతో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆయనను అభ్యర్ధిగా ఖరారు చేశారు.