– టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు
కోతి, పైగా కల్లుతాగింది అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం, మంత్రుల పరిస్థితి ఉందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడిన వివరాలు క్లుప్తంగా మీకోసం…! వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు పంట విరామం, వ్యవసాయానికి స్వస్తి పలకండని పిలుపునివ్వటం సిగ్గుగా వుంది. వరి సాగు వద్దు, వరి పంట పండించొద్దు, వ్యవసాయానికి స్వస్తి పలకమని కన్నబాబుకు చెప్పే హక్కు ఎవరిచ్చారు. ఈ విషయాన్ని ప్రభుత్వాన్ని, మంత్రులను ప్రశ్నిస్తున్నాను. రైతులకివ్వాల్సిన నష్టం, ఇన్ పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ లాంటి రాయితీలనుండి తప్పించుకునేందుకే ఈ డ్రామాలు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. మీ అసమర్థ, చేతకాని పాలనను కప్పిపుచ్చుకోవడానికి, మీ స్వలాభం కోసం రైతులకు శిక్ష వేస్తారా?
ఈ రెండున్నర సంవత్సరాలుగా రైతులు వ్యవసాయం చేయలేకపోతున్నారు. పంట పండించి నష్టపోతున్నారు. పంట పండించి నష్టపోవడంకంటే పంట విరామం తీసుకోవడం మేలు అనడం సబబేనా? క్రాప్ హాలిడే ప్రకటించడం ఎంతవరకు సబబుకాదు.రైతుల పోరాటానికి కేంద్రం సైతం తలొగ్గింది, మీరెంత?. కల్లుతాగిన కోతిలా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. వైసీపీ పాలనలో ప్రజల ధన, ప్రాణ, మానానికి రక్షణ లేకుండా పోయింది. ఏం చేసినా చెల్లుబాటవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వముంది. కల్లుతాగిన కోతిలా జగన్ ప్రభుత్వం ఎన్నాళ్లు వ్యవహరిస్తోందు చూద్దాం. వరి సాగుచేయొద్దని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు అంటున్నారు ఇది ప్రభుత్వ అసమర్థత కాదా? వ్యవసాయానికి స్వస్తి పలకమని చెప్పడం దుర్మార్గం.
రైతులకు ఇచ్చే ఇన్ పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ లాంటి రాయితీలు ఇవ్వాల్సిన అవసరముండదనే ఉద్దేశంతోనే వ్యవసాయానికి స్వస్తి పలకమంటున్నారు. మీపై ఉన్న భారాన్ని తొలగించుకోవడానికి వ్యవసాయానికే స్వస్తి పలకమంటే ఎలా? దీంతో ప్రభుత్వ దిగజారుడు తనం బయటపడుతోంది. అసమర్థ, చేతకాని పాలన సాగిస్తున్నారు. మీ స్వలాభం కోసం రైతులకు శిక్ష వేస్తారా? పంటలు వేసి నష్టపతున్నారు., కొందరు వ్యవసాయం చేయలేకపోతున్నారు. వ్యవసాయం తప్ప ఏమీ తెలియని రైతులు పంట పండించి నష్టపోవడంకంటే పంట విరామం మేలు అని పంట విరామం ప్రకటించడం ప్రభుత్వానికి సిగ్గుగా లేదా? ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వ్యవసాయం, పారిశ్రామికంగా పరిశ్రమలు అవసరం. రాష్ట్రంలో పరిశ్రమలేమైపోయాయో అందరికీ తెలుసు. మంచి రహదారులుండాలి. శాంతిభద్రతలు అవసరం. పారిశ్రామికులందరినీ రాష్ట్రం నుండి తరిమేస్తున్నారు. రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. గుంతలు పూడ్చడానికి కూడా ప్రభుత్వం పూనుకోవడంలేదు.
ప్రతిపక్షాలను అంతమొందించడానికి మాత్రమే పోలీసు వ్యవస్థ పనిచేస్తోంది. ఆదాయం వచ్చే రంగాన్ని పెంచుకుంటూ పోతున్నారు. ఆదాయం రాని వాటిని తెంపుకుంటూ పోతున్నారు. ఆఫ్గానిస్తానీయులకు డ్రగ్స్, హెరాయిన్, గంజాయి ఎలా అభివృద్ధికి వనరులయ్యాయో, ఏపీకి లిక్కర్, మద్యం అలా మారింది. మద్యం షాపులు పెంచుకుంటూ పోతున్నారు. లిక్కర్ మాల్స్, స్టోర్స్ లను పెంచుకుంటూ పోతున్నారు. రైతు కన్నెర్ర చేసినా, రైతు కంట కన్నీరు పెట్టుకున్నా ప్రభుత్వాలే కూలిపోతాయి. రైతుల పోరాటానికి తలొగ్గి మూడు సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసుకున్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాలి. వైసీపీకి 151 సీట్లు ఇచ్చారనే అహంకారం, అహంభావం తగ్గలేదు. వ్యవసాయానికి స్వస్తి పలకండనే పిలుపును వెనక్కి తీసుకోకపోతే రైతులే ప్రభుత్వానికి స్వస్తి పలుకుతారని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు.