Suryaa.co.in

Telangana

గోదాంను ప్రారంభించిన నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు

– వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం చలపర్తి గ్రామంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ నిధులతో ఏర్పాటు చేసిన 10 వేల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం గల గోదాం ను ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి ఏమన్నారంటే..
గతంలో 36 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం గల గోదాం లు మాత్రమే ఉండగా… ఈ 9 సంవత్సరాలలో వాటిని 74 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కు పెంచాము.తెలంగాణ లో రైతు బంధు పథకం వల్ల ప్రతీ చేను, చెలక పచ్చగా మారాయి.తెలంగాణ లోని ప్రతి మారుమూల పల్లె ప్రాంతంలో రైతుల భూముల విలువలు గణనీయంగా పెరిగాయి.

రైతు బంధు, రైతు భీమా పథకాల గొప్పదనం అంతర్జాతీయ స్థాయిలో ఐక్య రాజ్య సమితిలో మారుమోగుతున్నాయి.అకాల వర్షం వల్ల నష్టపోయిన ప్రతీ రైతుకు మన రాష్ట్ర నిధులతోనే 10 వేల రూపాయల నష్ట పరిహారం అందిస్తున్నాం.65 వేల కోట్లు రైతు బంధు కు, 5 వేల కోట్లు రైతు భీమాకు అందచేశాం.

ఇప్పటి వరకు ఒక్క వ్యవసాయ రంగం మీదే 4లక్షల 50 వేల కోట్లు ఖర్చు చేశాం.సాగునీటికి ఒక లక్షా 59 వేల కోట్లు, మక్కల కొనుగోలు కోసం 10 వేల కోట్లు ఖర్చు చేశాం. దేశం లో ఏ రాష్ట్రo ఇలా ఖర్చు పెట్టలేదు. వ్యవసాయ యాంత్రీ కరణ కోసం తప్పకుండా కృషి చేస్తా.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఏమన్నారంటే..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం మారుముల గ్రామానికి కూడా సాగు, తాగు నీరు అందుతుంది.వడగండ్ల వాన వల్ల పంట నష్టం కలిగిన ఏ ఒక్క ఎకరం వదిలి పెట్టకుండా..నష్టపోయిన ప్రతీ ఒక్క రైతును ఆదుకోవాలని నష్ట పరిహారం కింద నర్సంపేట నియోజకవర్గం కు 40 కోట్లు మంజురు చేశాం.దేశం లో ఎక్కడ లేని విధంగా.. అకాల వర్షం వల్ల పంట నష్టపోయిన రైతులకు 10 వేల రూపాయల నష్ట పరిహారం ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే.

నర్సంపేట నియోజకవర్గం లో పండిన పంటకు సరిపడా గోదాములు ఉన్నాయి.తెలంగాణ రైతులకు అందుతున్న అనేక పథకాలు నేడు అన్ని రాష్ట్రాలకు ఆదర్శం గా నిలుస్తున్నాయి.తడిసిన వడ్లను కూడా కొనాలని మన ముఖ్యమంత్రి ఆదేశించారు.వరంగల్ జిల్లాలోనే అత్యంత ఎక్కువగా నర్సంపేట నియోజకవర్గంకు Mla పెద్ది సుదర్శన్ రెడ్డి 70 కోట్లతో రోడ్లను మంజూరు చేపించుకున్నారు.

ఈ కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE