విజయవాడలోని నిర్మల హైస్కూల్లో శనివారం నిర్వహించిన సైన్స్ ఫేర్ అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి పటమట సీఐ పావన కిషోర్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ముఖ్య అతిథిగా రెవరెండ్ సిస్టర్ బ్లాంచ్ డి’మెల్లో పాల్గొనగా, ప్రిన్సిపాల్ సిస్టర్ గిబి ఆంటోని విద్యార్థుల సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచనా శక్తిని అభినందించారు. సైన్స్, గణితం, సోషల్ స్టడీస్, కంప్యూటర్, ఆర్ట్ , క్రాఫ్ట్ విభాగాల ఉపాధ్యాయులు చురుకుగా పాల్గొని, ప్రతి విభాగం నుంచి విద్యార్థులు అనేక వర్కింగ్ మోడల్స్‌ను సిద్ధం చేశారు. ఆర్ట్ గ్యాలరీలో విద్యార్థుల కళాత్మక ప్రతిభ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల సమిష్టి కృషితో ఫేర్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు కరస్పాండెంట్ సిస్టర్ రోబిల్ మాథ్యూ అభినందించారు. విద్యార్థుల తల్లి దండ్రులు పెద్దయెత్తున కార్యక్రమానికి హాజరయ్యారు.
