Suryaa.co.in

Andhra Pradesh

శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు నిరుద్యోగ రణం యాత్ర

– తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు

రాష్ట్ర తెలుగుయువత అధ్వర్యంలో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు నిరుద్యోగ రణం యాత్ర చేపట్టనున్నట్లు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు పేర్కొన్నారు. ఆదివారం నిరుద్యోగ రణం యాత్రకు సంబందించిన పోస్టర్ ను తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో తెలుగు యువత కార్యవర్గం విడుదల చేశారు. ఈ సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు మాట్లాడుతూ…

రాయలసీమ బిడ్డను, మాట తప్పను అని జగన్ మాటిచ్చి మూడున్నర సంవత్సరాలు అవుతున్నప్పటికీ నిరుద్యోగుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. రాష్ట్రంలో 2లక్షల 30 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, నిరుద్యోగులకు అవకాశాలు కల్పిస్తానని చెప్పి నిండా మోసం చేశారు.

ఊరూరా తిరిగి బామ్మలకు ముద్దులు పెట్టి ముంచారు. 30 లక్షల నిరుద్యోగ యువత నమ్మి ఓటేస్తే నిలువునా దగా చేశారు. యువకుడు.. యువత బాధలు అర్థం చేసుకుంటాడనుకుని మోసపోయాం. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పి చివరకు జాబ్ లెస్ క్యాలెండర్ విడుదల చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2లక్షల 30 వేల ఉద్యోగాలు భర్తీ చేసేంతవరకు వదిలేదిలేదు. తెలుగు యువత తరపున నిరుద్యోగ రణం ప్రారంభించాం. నిరుద్యోగ యువత కోసం నిరుద్యోగ రణం యాత్ర ప్రారంభించాం.

శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు సాగే ఈ యాత్రకు నిరుద్యోగ యువత తెలుగు యువత సహకరించాలి. వారికి తెలుగు యువత అండగా ఉంటుంది. కదలిరండి. జగన్ కేసులు పెడతాడని భయపడి ఇంట్లో కూర్చోద్దు. ఇప్పటికే యువత భవిష్యత్తును అంధకారం చేశాడు. ఎన్ని అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసినా తెలుగు యువత నిరుద్యోగులకు అండగా ఉంటుంది. మాయల మాంత్రికుడు జగన్ ప్రతి యేడాది డిఎస్సీ వేస్తానని చెప్పి ఇంతవరకు ఒక్క డిఎస్సీ కూడా వేయలేదు. గ్రూప్-1, గ్రూప్-2 ఇస్తానని ఇంతవరకు ఇవ్వలేదు. కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ మిథ్యే. రావాల్సిన వాటాలు, సామంత రాజుల వద్ద నుండి కప్పం తెప్పించుకునే పనిలో సీఎం నిమగ్నమయ్యాడు.

నిరుద్యోగులు ఉద్యోగాలు అడిగితే మార్కెట్ లో చేపలు అమ్ముకోమంటాడు. చంద్రబాబునాయుడు అనేక లక్షల మందికి నిరుద్యోగభృతి కల్పించారు. మంత్రులందరూ వాటాలకు ఎగబడుతున్నారు. వారిని ప్రజలు తన్ని తరిమేసే రోజులొస్తాయి. కోట్లాది రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని ముంచుతున్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, అరెస్టులు చేసినా మేము ఈ నిరుద్యోగ రణయాత్ర చేసి తీరుతాం. నేడు రాష్ట్రంలో నిరుద్యోగులు పక్క రాష్ట్రాలకు వలస వెళ్లే పరిస్థితి వచ్చింది. నిత్యం నిరుద్యోగుల తరఫున పోరాడుతాం.

జాబ్ క్యాలెండర్ విడుదల చేసేంతవరకు వదలం. మా యువ నాయకుడు నారా లోకేష్ అనేకసార్లు నిరుద్యోగుల తరఫున ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. యువతుకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ వచ్చారు. ప్రతిపక్ష పార్టీ నేతలు కోరినా ఫలితం లేదు. ఎన్ని లేఖలు రాసినా నీకేమో చీమకుట్టినట్లుగా కూడా లేదు. తాడేపల్లి ప్యాలెస్ లోని నీ కుర్చీని కదిలిస్తామని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు హెచ్చరించారు. అనంతరం తెలుగు యువత కార్యవర్గం ‘‘జాబ్ ఎక్కడ జగన్..’’ అంటూ నినదించారు.

LEAVE A RESPONSE