– సరికొత్త పెట్టుబడిదారీ
–వ్యాపార ప్రజాస్వామ్య సూత్రం
– బీఆర్ఎస్ ఎం ఎల్ సీ దాసోజు శ్రవణ్ ట్వీట్
హైదరాబాద్: తెలంగాణ పల్లెల్లో ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికలు కాదు అండీ…వ్యాపార నిమిత్తమైన వేలంపాటలే నడుస్తున్నాయట! సర్పంచ్ పోస్టులు అభ్యర్థులతో కాదు… బిడ్డర్లతోనే నియమించబడుతున్నాయి! ఇలా పోతే ఇక ఎంఎల్ ఏ, ఎంపీ సీట్లకూడా ఈ- ఆక్షన్ పెట్టెయ్యడమే మంచిదేమో! అటు ఓటర్లకీ, ఇటు ప్రభుత్వానికీ, ఎన్నికల సంఘానికీ ఎన్నికల నిర్వహణ భారమే లేదుగా? వేల కోట్ల పబ్లిక్ ఖర్చు కూడా ఆదా అవుతుంది. ప్రచారం లేదు… ర్యాలీలు లేవు… ఓటింగ్ కోసం చాంతాడంత లైన్లలో నిలబడి ఇబ్బంది లేదు… ఈ వీ ఎంలు, బూతులు, పోలింగ్ స్టాఫ్, పోలీసులు, సెక్యూరిటీ— ఏవి అవసరం లేకుండా “ఆన్లైన్ వేలం”తో పని అయిపోతుంది! ఎవడు ఎక్కువ బిడ్ వేస్తాడో వాడే గెలుపు, ‘హయ్యెస్ట్ బిడ్డర్’ ఎంఎల్ ఏ, ‘హయ్యెస్ట్ బిడ్డర్’ ఎంపీ. ఆ వచ్చే డబ్బుతో కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమాలు. అలా అయితే… ప్రజాస్వామ్యం మిగిలేది కేవలం స్టాంప్ పేపర్ మీదే! ఓటరుకు నోటు, సీటుకు మూట! సరికొత్త పెట్టుబడిదారీ–వ్యాపార ప్రజాస్వామ్య సూత్రం!