Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు, పవన్ ఎన్ని దూషణలు చేసినా దానిని ఆశీర్వాదంగానే తీసుకుంటాం

-అటవీశాఖ ప్రజలకు మరింత చేరువ కావాలి
– ప్రతి కుటుంబానికి మేలు చేసేలా జగన్ పాలన ఉంది
– జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు
– నా రాజకీయ జీవితంలో ఇంత మంచి పాలనను ఎప్పుడూ చూడలేదు
– ప్రజలు వైయస్ జగన్ ని మళ్ళీ సీఎంను చేస్తారు
– అయ్యన్నపాత్రుడికి పోయేకాలం దాపురించింది
– సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసే వారికి ప్రజలే బుద్ది చెబుతారు
– చంద్రబాబు, పవన్ ఎన్ని దూషణలు చేసినా దానిని ఆశీర్వాదంగానే తీసుకుంటాం
– మంగళగిరిలో అరణ్యభవన్ ను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

అమరావతి: గుంటూరుజిల్లా మంగళగిరిలో రాష్ట్ర అటవీశాఖ నూతన కార్యాలయం అరణ్యభవన్ ను గురువారం రాష్ట్ర అటవీ, ఇంధన, పర్యావరణం, శాస్త్ర-సాంకేతిక, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అటవీశాఖ నూతన భవనాన్ని మంగళగిరిలో ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో అటవీశాఖ ప్రజలకు మరింత చేరువ కావాలని, తన పనితీరును మరింత మెరుగు పరుచుకోవాలని ఆకాంక్షించారు.

అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ…
రాష్ట్రంలో వైయస్ జగన్ పాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. ప్రతి కుటుంబానికి మేలు చేయాలనే లక్ష్యంతో సీఎం వైయస్ జగన్ పనిచేస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా, ప్రజలకు మేలు చేసేలా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఈ పాలనను నియంత పాలన అని విమర్శించడం విడ్డూరంగా ఉందని, వారి దూషణలను ఆశీర్వాదంగా తీసుకుంటామని అన్నారు.

రాష్ట్రంలో ఇంత మంచి పాలనను నా యాబై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ప్రజలకు ఇంత మంచి చేసిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో గతంలో ఎవరూ లేరని అన్నారు. ప్రజల మద్దతుతో వైయస్ జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు.అయ్యన్నపాత్రుడికి పోయే కాలం దాపురించిందని, ముఖ్యమంత్రిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా మాట్లాడేవారికి త్వరలోనే ప్రజలు తగిన బుద్దిచెబుతారని అన్నారు. అరణ్యభవన్ ప్రారంభోత్సవంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ (అటవీశాఖ) నీరబ్ కుమార్ ప్రసాద్, అటవీదళాల అధిపతి వై.మదుసూధన్ రెడ్డి, పలువురు అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE