Suryaa.co.in

Telangana

మీరెంత అణచివేసినా తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తాం

– బండి సంజయ్ అరెస్ట్ ను ఖండించిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్
– సమాధానం చెప్పాలంటూ ప్రశ్నిస్తోన్న బీజేపీ నాయకులను , కార్యకర్తలను అరెస్ట్ చేయడం కేసీఆర్ సర్కార్ పిరికిపంద చర్య

న్యూఢిల్లీ ; పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ లో పెద్ద తలకాయలను అరెస్టు చేయాలని పోరాటం చేస్తోన్న బీజేపీ రాష్ట్ర అద్యక్షడు బండి సంజయ్, బీజేపీ శ్రేణులను అరెస్టు చేయడాన్ని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు , ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడ్డాక కనీసం పోటీ పరీక్షలు కూడా పెట్టలేని దద్దమ్మ ప్రభుత్వం పైనుంచి బీజేపీ నాయకులను అరెస్టు చేస్తూ ,ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక పోలీసులను ప్రయోగిస్తే బీజేపీ వెనకంజ వేయదన్నారు.

ఇంటర్ విద్యార్ధులు ఆత్మహత్య, ఎంసెట్ పేపర్ లీకేజీ, టీఎస్ పీ ఎస్సీ పేపర్ లీకేజీ అన్నింటి వెనక కూడా ప్రభుత్వం లోని పెద్దతలకాయల హస్తం లేకుండా జరగదని వెంటనే సీబీఐ విచారణ లేదా సిట్టింగ్ జడ్జ్ చేత విచారణ చేయించాలని డాక్టర్ లక్ష్మణ్ డిమాండ్ చేశారు.

తెలంగాణ వస్తే నిరుద్యోగులకు ఇంటికో ఉద్యోగం వస్తుందని ఆశపడితే వేసిన కొన్నొ నోటిఫకేషన్లు తప్పుల తడకగా ఇస్తే హైకోర్టు మొట్టికాయలు ఇచ్చిందని కనీసం పరీక్షలు కూడా నిర్వహించలేని ప్రభుత్వం ప్రజలకు అవసరమా అని ప్రశ్నించారు . తెలంగాణ సర్కారుకు రోజులు దగ్గర పడ్డాయి కాబట్టే నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ సర్కారకు బుద్ది చెప్పేవరకు బీజేపీ పోరాటం ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆగదన్నారు.

LEAVE A RESPONSE