Suryaa.co.in

Andhra Pradesh

ఇక ఏపీకి అడ్వాన్సులు ఇవ్వడం కుదరదు!

– ముందు ఆ 500 కోట్ల లెక్కలు చెప్పండి
– మీ వాటా చెల్లించిన తర్వాతే ఏదైనా
– రాష్ట్రంపై కేంద్ర ఆర్థికశాఖ ఆగ్రహం

అమరావతి: ఏపీ ప్రభుత్వ తీరుపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. విదేశీ ఆర్థిక సంస్థల నుంచి వచ్చే నిధుల వినియోగంపై కేంద్రం మండిపడింది. కేంద్ర ఆర్థిక శాఖలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనమిక్‌ అఫైర్స్‌ నుంచి రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి ఘాటు లేఖ రాశారు. ఏఐఐబీ, ఎన్‌డీబీ నుంచి మంజూరైన రుణాలకు అడ్వాన్స్‌లు ఇప్పించాలని కేంద్ర ఆర్థిక శాఖకు లేఖ ఏపీ ప్రభుత్వం రాసింది. ఏపీ ప్రభుత్వ లేఖపై కేంద్ర ఆర్థిక శాఖ ఘాటుగా స్పందించింది.

ఏఐఐబీ నుంచి అడ్వాన్స్‌ రూపంలో ఇచ్చిన రూ.500 కోట్లకు ముందు లెక్క చెప్పాలని కేంద్రం కోరింది. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా నిధులు జమచేయకుండా.. విదేశీ ఆర్థిక సంస్థలు నిధులు ఎలా ఇస్తామని కేంద్రం ప్రశ్నించింది. ఇప్పటికే తీసుకున్న అడ్వాన్స్‌ల వినియోగానికి లెక్కలు పంపాలని ఆదేశించింది. ప్రాజెక్ట్‌ ఇంప్లిమెంట్‌ అథారిటీకి ప్రభుత్వంలోని నిధులను బదిలీ చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాలిచ్చింది.

ప్రతి నెల పనుల పురోగతి, నిధుల వినియోగానికి సంబంధించి.. నివేదిక ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. కేంద్ర ఆర్థికశాఖ షరతులతో దాదాపుగా రూ.8 వేల కోట్ల రుణం మంజూరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలను అమలు చేస్తేనే నిధులు విడుదల అవుతాయని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనమిక్‌ అఫైర్స్‌ స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వానికి అడ్వాన్స్‌లు ఇవ్వడం కుదరదని కేంద్రం స్పష్టం చేసింది.

LEAVE A RESPONSE