– వైసీపీ ప్రభుత్వం దళితులపై పెట్టిన తప్పుడు కేసులు మరే రాష్ట్రంలో, ఏ ప్రభుత్వం పెట్టలేదు : పరసారత్నం
“యువగళం పాదయాత్రకు ప్రజలనుంచి ముఖ్యంగా యువత, మహిళల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, కార్మికులు, కర్షకులు వారి బాధలు లోకేశ్ తో చెప్పుకుంటున్నారు. జగన్ రెడ్డి దుష్టపాలనకు చరమగీతం పాడాలని యువనేతకు మొరపెట్టుకుంటున్నారు. ప్రజలకష్టాలు, నష్టాలు, బాధలు అన్నీ తెలుసుకొని, టీడీపీ ప్రభు త్వంలో వారిని సంతోషంగా ఉంచేలా టీడీపీ మేనిఫెస్టో రూపకల్పన చేయాలని లోకేశ్ భావిస్తు న్నారు. గిట్టుబాటుధరలేక, పండించిన పంటఉత్పత్తులు కొనేవారు లేక రైతులు లబోదిబో మంటున్నారు. యువత ఉద్యోగ, ఉపాధిలేక బావురుమంటున్నారు. వారితోపాటు, మహిళ ల వెతలు, కార్మికులు, కర్షకుల బాధలు తెలుసుకోవడానికే ఈ యువగళం సాగుతోంది.
జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంసపాలనకు శ్రీకారం చుట్టా డు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు ఎవరైనా ప్రజాధనాన్ని దుర్వినియోగంచేస్తారా? అది మొదలు అమరావతి విధ్వంసం.. చంద్రబాబు పేదలకోసం కట్టించిన ఇళ్లను పాడుపెట్టడం.. రైతులకు టీడీపీప్రభుత్వం అందించిన పంటలబీమా, ఇన్ పుట్ సబ్సిడీ, యంత్రపరికరాలు, ఎరువులు, సూక్ష్మపోషకాల ఉచిత పంపిణీ వంటివాటిని జగన్ అటకెక్కించాడు. గతఎన్నికల్లో జగన్ రెడ్డికి అండగా నిలిచినందుకు దళితులు భారీమూల్యమే చెల్లించుకున్నారు. రాష్ట్రంలో దళితులపై ఈప్రభుత్వం పెట్టినన్ని తప్పుడు కేసులు ఎక్కడాలేవు.
జగన్ 151స్థానాలు గెలవడానికి ప్రధాన కారణం ఎస్సీ, ఎస్టీలే. కానీ వైసీపీప్రభుత్వం డాక్టర్ సుధాకర్ మొదలు విక్రమ్, కిరణ్, ఓంప్రతాప్ లాంటి ఎందరో దళితయువకులు ప్రాణాలు బలి తీసుకుంది? దళితడ్రైవర్ని చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన వైసీపీఎమ్మెల్సీ అనంతబాబు పై జగన్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడానికి కారణం దళితులపై ఆయనకున్న చులక న భావమే. దళితమహిళ నాగమ్మను పులివెందులలో దారుణంగా హతమార్చినా జగన్ రెడ్డి స్పందించలేదు. ఎస్టీమహిళ మంత్రూబాయిని వైసీపీనేత శ్రీనివాసరెడ్డి ట్రాక్టర్ తో తొక్కించి చంపితే అతనిపై ఆఖరికి చిన్నకేసు కూడా పెట్టలేదు. ఇలాంటి అనేకఘటనలు జగన్ రెడ్డికి దళితులపై ఉన్న ప్రేమాభిమానాలకు దర్పణం పడుతున్నాయి. దళితులు జగన్ రెడ్డిని నమ్మిమోసపోవద్దని, 6సార్లు ఎమ్మెల్యేగాగెలిచి, మంత్రిగా పనిచేసిన దళితనేతగా, తోటి దళితసోదరులకు విజ్ఞప్తిచేస్తున్నా. జగన్ తనసలహాదారుల్లో గానీ, ఇతరత్రా నామినేటెడ్ పదవుల్లోగానీ దళితులకు ఎలాంటి పదవులుఇచ్చాడో, వారికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తు న్నాడో గమనించాలి. రాష్ట్రంలో దళితులపై జగన్ రెడ్డి పెట్టిన కేసులు ఏ ప్రభుత్వం ఇప్పటి వరకు పెట్టిందిలేదు. దళితసోదరులంతా స్వయంశక్తితో ఎదగాలని, వారికాళ్లపై వారు నిలబ డాలని కోరుకునే వ్యక్తి చంద్రబాబు ఒక్కడే. వచ్చేఎన్నికల్లో దళితులంతా మూకుమ్మడిగా చంద్రబాబునాయకత్వాన్ని బలపరచాలని కోరుతున్నా. యువగళం యాత్రలో లోకేశ్ పై దాడిచేయడానికి వైసీపీగూండాలు కర్రలు, రాళ్లు, కత్తులతో వస్తే పోలీసులు చోద్యంచూశారు. లోకేశ్ ని అడ్డుకోవడానికి, కాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మదుసూధన్ రెడ్డికి చెందిన కొందరువైసీపీ గూండాలు, కర్రలు,రాళ్లు, కత్తులతో నిన్న పాదయాత్ర ప్రదేశానికి వచ్చారు. వారు కవ్వింపుచర్యలకు పాల్పడుతుంటే, పోలీసులు చోద్యంచూశారు. వచ్చేఎన్నికల్లో కాళ హస్తిలో టీడీపీతరుపున పోటీచేస్తున్న బొజ్జల సుధీర్ రెడ్డిని భారీమెజారిటీతో గెలిపించాలని దళితులంతా ఆయనకు అండగా ఉండాలని కోరుతున్నా.”
దళితుల అండతో ముఖ్యమంత్రి అయిన జగన్ రెడ్డిని, వారిని అడ్డంపెట్టుకొని దోపిడీచేస్తున్న మధుసూదన్ రెడ్డిని దళితజాతి రాష్ట్రం నుంచి తరిమికొట్టాల్సిన సమయం వచ్చింది : పీ.సునీల్ కుమార్
“లోకేశ్ పాదయాత్రతో వైసీపీ ఎమ్మెల్యేల గుండెలు అదురుతున్నాయి. కాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తన అవినీతి, అక్రమార్జనను లోకేశ్ ఎక్కడ బయటపెడతాడో అన్నభయంతో గుండెలు బాదుకుంటున్నాడు. ఆ భయంతోనే నిన్న లోకేశ్ పాదయాత్రపైకి వైసీపీ గూండాలు, రౌడీలను పంపాడు. కాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తన అవినీతి, అక్రమార్జనకు దళితుల్ని పావులుగా వాడుకుంటున్నాడు. వైసీపీఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి దోపిడీకి అంతేలేకుండా పోయింది. దేవుడిగుడి నికూడా తన అక్రమార్జన కేంద్రంగా మార్చుకున్నాడు. కరోనాతో రాష్ట్రాలు, దేశాలు అన్నీ ఆర్థి కంగా దెబ్బతింటే, మధుసూదన్ రెడ్డి మాత్రం ఆసమయంలోనే పక్కరాష్ట్రాల నుంచి కల్తీ మద్యం తెప్పించి, అమ్ముకున్నాడు. చెరువులు, గుట్టలు, కొండలు, ప్రభుత్వస్థలాలు వేటినీ వదలకుండా కబ్జాచేస్తున్నాడు. స్వర్ణముఖినదిలోని ఇసుకను ఇతరరాష్ట్రాలకు తరలిస్తూ వం దలకోట్లు కొట్టేస్తున్నాడు.
దళితుల్ని పావులుగా వాడుకుంటూ, వారిని అడ్డంపెట్టుకొనే మధు సూదన్ రెడ్డి తన అవినీతిని కొనసాగిస్తున్నాడు. మధుసూదన్ రెడ్డి అక్రమార్జన, అవినీతిలో పావులుగా మారిన దళితసోదరులు, ఆయన సంపాదించినదానిలో వాటాలు అడగాలని, తోటి దళితుడిగా వారికి సూచిస్తున్నా. మధుసూదన్ రెడ్డి ఆక్రమించుకున్న భూముల్లో పాగా వేసి, వాటిలో తమకు వాటాకావాలని కోరండి. మధుసూదన్ రెడ్డి మాయమాటలు విని, అత ని అవినీతి, దోపిడీలో భాగస్వాములుగామారి, దళితులు బంగారం లాంటి జీవితాల్ని నాశ నం చేసుకోవద్దని కోరుతున్నా. మధుసూదన్ రెడ్డి ఎన్ని కుట్రలుపన్ని, యువగళం యాత్ర ను అడ్డుకోవాలనిచూసినా, టీడీపీప్రభుత్వం రాగానే అతను కటకటాలపాలు కాక తప్పదు. అంబేద్కర్ మహాశయుడు దళితులకు ఇచ్చిన హక్కులు, అధికారాలు, స్వేఛ్ఛని కాలరా స్తున్న ఈ కాలకేయుడి పాలనకు మనదళితులంతా చరమగీతం పాడాల్సిన సమయం వచ్చింది. కాళహస్తి నియోజకవర్గంలోని దళితసోదరులంతా జగన్ రెడ్డి, బియ్యపు మధుసూ దన్ రెడ్డిల అవినీతిపై తిరుగుబాటు చేయాల్సిన సమయం వచ్చింది. దళితులకు న్యాయం చేసి, వారిని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఆదుకున్న ఘనత ముమ్మాటికీ చంద్రబాబుదేనని ప్రతిదళితసోదరుడు గ్రహించాలి. రాష్ట్రానికి పట్టిన దరిద్రమైన జగన్ రెడ్డిని, తరి మికొడితేనే దళితజాతికి మంచిరోజులు వస్తాయి.”