Suryaa.co.in

Andhra Pradesh

మర్రి కి మొండి చేయి…

-ఉమ్మారెడ్డికు మరోసారి అవకాశం..
– అనూహ్యంగా మురుగుడుకు అవకాశం
మండలి చైర్మన్‌గా ఉమ్మారెడ్డి?
వైసిపి సీనియర్ నేత , చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ కు పార్టీ అధిష్టానం మరోసారి మొండిచేయి చూపింది. స్దానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎంపిక లో మర్రి కి ఆశాభంగం ఎదురైంది. గుంటూరు జిల్లా నుంచి సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కు తిరిగి స్దానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించి గౌరవించారు. అదే విదంగా చేనేత సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు కు అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవి దక్కింది.
కాగా శాసనమండలి చైర్మన్‌గా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నియమితులయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కేంద్రమంత్రిగా పనిచేసిన ఉమ్మారె డ్డికి శాసన చట్టాలపై సంపూర్ణ అవగాహన ఉంది. అదీగాక, ప్రస్తుత శాసనమండలిలో ఆయన అందరి కంటే సీనియర్.
ఎట్టి పరిస్థితుల్లోనైనా మర్రి రాజశేఖర్ కు స్దానిక సంస్థల కోటా మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ స్దానం దక్కుతుందని అందరు బావించారు. గడిచిన ఎన్నికల ప్రచార సభలో జగన్ రెడ్డి చిలకలూరిపేట పట్టణంలో నడిబొడ్డున మర్రి రాజశేఖర్ కు అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి పదవి ఇచ్చి అసెంబ్లీ లో తన పక్కన కూర్చోబెట్టుకుంటానని హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు గా పని చేసిన మర్రి రాజశేఖర్ కు చిలకలూరిపేట ఎమ్మెల్యే సీటు ఇవ్వకుండా పక్కన పెట్టి చివరి నిమిషంలో బిసి సామాజిక వర్గానికి చెందిన విడదల రజనీ ని ఎమ్మెల్యే అభ్యర్థి గా ప్రకటించారు.
విడదల రజనీని గెలిపించుకు రావాలని జగన్ ఆనాడు మర్రికు సూచించారు. విడదల రజనీని గెలిపిస్తే మర్రికు తొలి క్యాబినెట్ లోనే మంత్రి పదవి ఇస్తానని చిలకలూరిపేట పట్టణంలో విడదల రజనీ ఎన్నికల ప్రచార సభలో జగన్ రెడ్డి బహిరంగంగా హామీ ఇచ్చారు. జగన్ ఆదేశించినట్లుగానే మర్రి రాజశేఖర్ విడదల రజనీ గెలుపు కోసం శక్తివంచన లేకుండా పని చేశారు. వైసిపి ప్రభుత్వం అధికారం లోకి వచ్చి జగన్ సీఎం అవ్వగానే గుంటూరు జిల్లా నుంచి ముందుగా మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి వస్తుందని బావించారు. అయితే మంత్రి పదవి అలా ఉంచితే కనీసం ఎమ్మెల్సీ పదవి కోసం కుడా పరిసారి ఎదురుచూపులే మిగులుతున్నాయి.
వైసిపి అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయిన ప్రతిసారి మర్రి రాజశేఖర్ పేరు తెరమీదకు రావడం చివరకు నిరాశ ఎదురౌవ్వడం పరిపాటిగా మారింది. తాజాగా 14 ఎమ్మెల్సీ స్దానాలు ఒకే సారి ఖాళీ అవ్వడంతో ఈ సారి తప్పనిసరిగా గుంటూరు జిల్లా కు చెందిన మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ ఖాయమనే ప్రచారం బాగా జరిగింది.
గుంటూరు జిల్లా లోనే రెండు స్దానిక సంస్థల ఎన్నికల ఎమ్మెల్సీ స్దానాలు ఉండటంతో ఒకటి సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు ఇవ్వగా రెండోది మర్రికి ఖాయమైందనే ప్రచారం బాగా జరిగింది. చివరకు ప్రభుత్వ సలహాదురు సజ్జల ఎమ్మెల్సీ అభ్యర్థులు ప్రకటన చూసి మర్రి రాజశేఖర్ తో పాటు ఆయన అనుచరులు డీల పడిపోయారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే విడదల రజనీకు , మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ కు మద్య గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి.
రెండున్నరేళ్లు ఇద్దరు రెండు గ్రూపులు గానే రాజకీయాలు కొనసాగుతున్నాయి. తాజాగా మర్రి కి ఎమ్మెల్సీ రాకపోవడంతో ఎమ్మెల్యే విడదల రజనీపై చేయి సాధించినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ పరిణామం మర్రి వర్గానికి మింగుడు పడటం లేదు. మర్రి రాజశేఖర్ వర్గం పార్టీ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతుంది. ఈ పరిణామం చూస్తుంటే వైసిపిలో మర్రిని ఇక పక్కన పెట్టినట్లేనని రాజకీయ విశ్లేషకులు బావిస్తున్నారు.

LEAVE A RESPONSE