– ప్లాస్టిక్ ను నివారిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం మంత్రి సవిత ..
పెనుకొండ : ప్లాస్టిక్ వద్దు పేపర్ బ్యాగ్ లు ముద్దు అంటూ ప్లాస్టిక్ నివారిద్దం పర్యావరణం కాపాడుదాం అని మంత్రి సవిత కోరారు. పెనుకొండ పట్టణంలో విద్యార్థులు నాయకులు కార్యకర్తలుతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ సర్కిల్ వద్ద విద్యార్థులతో మానవహారం నిర్వహించి పర్యావరణాన్ని కాపాడుదామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు. బజారులో వస్తువులు కొన్నసమయంలో ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించడం ప్రతి ఒక్కరికి అలవాటుగా మారడం విచారకరమన్నారు. వాటిని వాడి పారవేయడం వల్ల వాటివల్ల పర్యావరణం కలుషితమయ్యే ప్రమాదముందని శాస్త్రవేత్తలు హెచ్చరించారన్నారు.
ప్రతి ఒక్కరు విరివిగా మొక్కలు నాటి పచ్చదనం పెంపొందేలా చూడాలని కోరారు. ప్లాస్టిక్ కవర్, వస్తువుల వాడకాన్ని ప్రతి ఒక్కరు నిషేధించాలని, పేపర్ సంచులు వాడి పర్యావరణాన్ని కాపాడాలని స్థానిక వ్యాపారులకు, ప్రజలకు అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో ఆర్డీవో ఆనంద రావు ,ఎమ్మార్వో స్వాతి, మున్సిపల్ కమిషనర్ సతీష్ కూటమి నాయకులు కార్యకర్తలు విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు