-ఈ చిత్రహింసలు భరించలేం
-చచ్చిపోవాలనిపిస్తోంది
-కోమాళ్లపూడి దంపతుల ఆక్రోశం
(బహదూర్)
పోలీసన్నలకు విజ్ఞప్తి. ఒక హోంగార్డుకు ఇంత బలం ఎక్కడిదో? తన సహచర కుటుంబం ఆధీనంలో స్థలాన్ని స్వాధీనం చేసుకోవటానికి.. ఏకంగా సైకో అవతారం ఎత్తటం ఎంత వరకూ సబబు? అధికారులు అతడికే మద్దతు ఎందుకు ఇస్తున్నారు? నిజంగా.. చట్టప్రకారం న్యాయం అతడి పక్కనే ఉంటే.. సాయం చేయటంలో ఎలాంటి అభ్యంతరం లేదు. కేవలం హోంగార్డుగానే ఇంతగా అరాచకం సృష్టించాలా?
ఒకసారి కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం , గొల్లగూడెం లోని కొమ్మాళ్ళ పూడి ప్రాంతానికి చెందిన అముదాలపల్లి శ్రీను అనే అనామకుడు తన భార్య పిల్లలతో న్యాయం కోసం కలెక్టర్ ను ఎందుకు ఆశ్రయించాడు ? అతడే అబద్ధపు ఆరోపణలు చేస్తే… పోలీసులు అసలు సహించరు. ఆ విషయం అందరికీ తెలిసిందే. కడకు ఎక్కడికి వెళ్ళినా తమకు న్యాయం జరగలేదని తన కుటుంబ సభ్యులకు, తనకూ హోమ్ గార్డుతో ప్రాణ హాని ఉందని మొరపెట్టుకునే పరిస్థితిని ఎందుకు పరిశీలించరు.
ఈ హోంగార్డు నిత్యం తమను ఏదో ఒక రకంగా వేధిస్తున్నాడని కనీసం కడుపునిండా భోజనం చేయలేని దీన స్థితిలో ఉన్నామని ఆ దంపతులు ఆక్రోశం వెళ్లగక్కు తున్నారు. సరిహద్దులోని వచ్చి మరీ గేదె పేడ విసురుతున్నాడట. దుర్భాష లాడుతున్నాడట. మమల్ని వదిలేయమని ప్రాధేయపడుతున్న తగ్గటం లేదట. ఊరు విడిచి వెళ్లాలని బెదిరిస్తున్నాడట. పోలీసు అధికారుల చుట్టూ తిరిగినా కరుణించటం లేదట. ఏ ఒక్కరూ పట్టించుకోవట్లేదని, ఆదుకోవట్లేదని, ఈ దంపతులు అల్లాడిపోతున్నారు. ఇక తమకు ఆత్మహత్యే శరణ్యమని ఘోషిస్తున్నారు. కనీసం ఈ ఘోషకు స్పందించక పోతే.. అధికారులపై ప్రజల్లో వ్యతిరేక భావం పెరగటం ఖాయం.