– ఇది హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ లూటింగ్ పాలసీ
– 5లక్షల కోట్లు విలువైన భూమిని 5వేల కోట్లకే ఎందుకు కట్టబెడుతున్నారు?
– మిగతా నాలుగు లక్షల 95వేల కోట్లు స్కాం కదా?
– భవిష్యత్తు అవసరాల కోసం భూములు మిగల్చవా రేవంత్ రెడ్డి?
– నిజంగా 4740 ఎకరాలే ప్రభుత్వం పెట్టిందా?.. దీనిపై బహిరంగ చర్చకు సిద్దమా?
– రియల్ ఎస్టేట్ బ్రోకరీ ప్రభుత్వం ఇది
– బీజేపీ ఎందుకు మౌనంగా ఉంది – తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన పాలసీ మరొక తాజా స్కాం. కుంభకోణాకలకు కేరాఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్ పార్టీ కొత్త చేస్తున్న స్కామే ఈ కొత్త పాలసీ. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్ఫర్మేషన్ పాలసీ కాదు, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ లూటింగ్ పాలసీ. పారిశ్రామిక వాడల్లోని దాదాపు పది వేల ఎకరాల భూమిని పప్పు బెల్లాల్లా అమ్ముకునే కుట్రకు తెరలేపింది రేవంత్ ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా అడ్డగోలు దోపిడీ మీదనే దృష్టి పెట్టిండు రేవంత్ రెడ్డి లగచర్ల కావొచ్చు, హెచ్ సీయూ భూములు కావొచ్చు. ఇలా ఏది చూసినా దోపిడీనే.
ప్రజలకు ఏం చేయాలనే దోరణి కంటే కూడా, ఎక్కడ ఎంత దోపిడి చేయాలన్నదే రేవంతు ఆలోచన విధానం. మా హయాంలో అనుమతులు వార్తలు, పెట్టుబడుల వార్తలు వచ్చేవి. అమ్మకాల వార్తలు కాంగ్రెస్ హయాంలో వస్తున్నయి. మాది నమ్మకాన్ని పెంచిన ప్రభుత్వం అయితే, కాంగ్రెస్ అమ్మకాన్ని పెంచిన ప్రభుత్వం గజాల లెక్కన మొదలు కొని, వేల ఎకరాల దాకా ప్రతి ఇంచు భూమి అమ్మేస్తున్నడు. హౌసింగ్ బోర్డు లో ఉన్న ఆరు గజాలు, ఎనిమిది గజాలు కూడా అమ్ముతున్నడు రేవంత్ రెడ్డి.
గతంలో ఇదే రేవంత్ రెడ్డి భూములు అమ్ముకుంటూ పోతే ఎలా, ఆసుపత్రులు, విద్యాలయాలు చివరకు స్మశానాలు ఏర్పాటు చేయడానికి కూడా భూములు మిగలవు అన్నడు. నాడు సుద్దపూస లేక్క మాట్లాడి, ఇప్పుడు భూములు తెగనమ్ముతున్నడు. భవిష్యత్తు అవసరాల కోసం భూములు మిగల్చవా రేవంత్ రెడ్డి? నగరం విస్తరణ జరిగితే, ఇతర రాష్ట్రాల్లో పారిశ్రామిక భూములను 50శాతం భూమిని ప్రభుత్వం తీసుకొని, మిగతా 50శాతం భూములను ఫీజులు తీసుకొని రెగ్యులరైజ్ చేస్తున్నరు.
కానీ రేవంత్ రెడ్డి మాత్రం కేవలం 30శాతం తీసుకొని తెగనమ్ముతున్నడు. అనుముల రేవంత్ రెడ్డి కాదు, అమ్మకాల రేవంత్ రెడ్డి. నిన్న బిఆర్ఎస్, కేటీఆర్ చెప్పిన మాటలు అక్షర సత్యం. శ్రీధర్ బాబు కూడా కొన్ని ఒప్పుకున్నారు. అందుకు థ్యాంక్స్. వేల కోట్లు, లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు తెరలేపిన స్కాం ఇది. 9292 ఎకరాల భూమిని 30శాతం రిజిస్ట్రేషన్ ద్వారా కట్టబెడితే 5వేల కోట్లు వస్తుందని శ్రీధర్ బాబు చెప్పారు. 9292 ఎకరాల భూముల విలువ 5లక్షల కోట్లు. 5లక్షల కోట్లు విలువైన భూమిని 5వేల కోట్లకే ఎందుకు కట్టబెడుతున్నారు? మిగతా నాలుగు లక్షల 95వేల కోట్లు స్కాం కదా? ఎందుకు కట్టబెడుతున్నారు. దీని వెనుక ఉన్న మత్లబ్ ఏమిటి? 9292లో మొత్తం భూమి కాదు, ఇందులో రోడ్లు, మోరీ పోగా 4740ఎకరాలే ఉంటదని మంత్రి బుకాయించారు. నేను అథారిటీగా చెబుతున్నాను.
రెవెన్యూ రీసోర్సు మొబిలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా చెబుతున్నా. నాతో పాటు కేటీఆర్ , ప్రశాంత్ ఇతర మంత్రులు ఉన్నారు.ఆరోజు కూడా ఈ ప్రతిపాదన వచ్చింది. శ్రీధర్ బాబు నేను సవాల్ చేస్తున్నా.. నిజంగా 4740 ఎకరాలే ప్రభుత్వం పెట్టిందా? దీనిపై బహిరంగ చర్చకు సిద్దమా? సగానికి సగం తగ్గించి చూపే ప్రయత్నం చేస్తున్నాడు శ్రీధర్ బాబు భూ కుంభకోణం పరిధి తగ్గించే ప్రయత్నం చేశారు మంత్రి. ప్రభుత్వం డొల్లతనం స్పష్టంగా బయటపడ్డది నిన్న కేటీఆర్ అడిగిన అనేక ప్రశ్నలకు మంత్రి గాని, ప్రభుత్వం గాని సమాధానం చెప్పలేకపోయింది మన రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ తో పోల్చితే రెండు రెట్ల స్కాం.
రెండు బడ్జెట్ లతో సమానమైన ఇంతటి నిర్ణయాన్ని అసెంబ్లీలో చర్చ పెట్టకుండా రాత్రికి రాత్రే చేస్తం అంటే ఎందుకు ఊరుకుంటాం? కేటీఆర్ అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పదు. కోర్టు ఆర్డర్ ఉన్నందున ఆనాడు మేము ఆజామాబాద్ భూముల విషయంలో నిర్ణయం తీసుకున్నాం. ఎస్ ఆర్ వో కింద 200 శాతం తీసుకున్నం. ఈనాడు కాంగ్రెస్ మాత్రం 30శాతం కడితే చాలు అంటున్నది. 5లక్షలు రావాల్సిన చోట 5వేల కోట్లు మాత్రమే వస్తాయని మంత్రి కుండబద్దలు కొట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు తీరని నష్టం ఇది.
వారం రోజుల్లో అప్లికేషన్లు పెట్టాలి, వారంలో టీజీఐఐసీ అప్లికేషన్ల పరిశీలన, అవతల వారం రోజుల్లో అధికారుల కమిటీ అనుమతి, ఇది వచ్చిన రెండు నెలల్లో మొత్తం స్కాం కథ పూర్తి. అంటే 2 నెలల్లో 5లక్షల కోట్లకు స్కెచ్ వేసింది రేవంతు సర్కారు. మార్కెట్ లో అమ్మితే 5లక్షల కోట్లు వస్తయి కదా అంటే సమాధానం లేదు? కోర్టు కేసులు, లీజుల వివాదాలు కారణం చూపి మొత్తం భూమిని తక్కువ ధరకే కొల్లగొట్టాలని కుట్ర చేస్తున్నారా అంటే సమాధానం లేదు. ఆనాడు బొందల గడ్డకు కూడా భూముల ఉండవు అన్నవు, నేడు గజాల చొప్పున భూములు అమ్ముతున్నావు. ప్రపంచ పెట్టుబడులు ఆకర్షించేందుకు టీఎస్ ఐపాస్ పాలసీ తెచ్చినం.
కాంగ్రెస్ మాత్రం భూములు అమ్మడానికి హిల్ టీపీ పాలసీ తెస్తున్నరు. ఓఆర్ఆర్ లోపల కాలుష్యం చేసే పరిశ్రమలను వెలుపలకు పంపాలి. గ్రీన్ కంపెనీలు కూడా మీ పాలసీ ద్వారా తరలి వెళ్తాయి. మీ వల్ల ఆ కంపెనీలు కూడా పోతాయి ఉపాధి ఉద్యోగాలు లేకుండా పోతాయి. మాది ఖజానా నింపే పాలసీ, కాంగ్రెస్ ది వాళ్ల జేబులు నింపుకునే పాలసీ. ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు వదిలి, దోచుకునే పాలసీలు తెస్తున్నరు. గతంలో మేము కాలుష్య పరిశ్రమల్లో 50శాతం భూముల్లో ఐటీ కంపెనీలు పెట్టుకోవచ్చని, మిగతా 50 శాతం గృహ అవసరాలకు వాడుకోవచ్చు అన్నం. కాంగ్రెస్ మాత్రం వాణిజ్య, వ్యాపార, రియల్ ఎస్టేట్ కోసం వినియోగించుకోవచ్చు అంటున్నది.
రియల్ ఎస్టేట్ బ్రోకరీ ప్రభుత్వం ఇది. బీజేపీ ఎందుకు మౌనంగా ఉంది. కాంగ్రెస్ తో కుమ్మక్కు కాకుంటే విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని.. ఎనిమిది ప్రశ్నలు సూటిగా అడుతున్నా. ప్రభుత్వ దోపిడినీ పూర్తి ఆధారాలతో బయటపెడుతున్నా. సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ ఎనిమిది ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. పారిశ్రామిక వేత్తలకు మేము ఇన్సెంటివ్స్ ఇస్తే, మీరు బిల్డర్లు, వ్యాపారులుగా తయారు చేస్తున్నారు.
భారత దేశంలో ఇంత పెద్ద భూ స్కాం లేదు, ద బిగ్గెస్ట్ ల్యాండ్ స్కాం ఇన్ ఇండియా అసెంబ్లీ పెట్టి వెంటనే చర్చకు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది మీ అయ్య జాగిరి కాదు, నాలుగు కోట్ల ప్రజల ఆస్తి. తాతల తండ్రుల తరతరాల ఆస్తి ఇది. మీరు ఇష్టం వచ్చినట్లు అమ్ముతం అంటే బిఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. అసెంబ్లీ పెట్టి పాలసీపై చర్చ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. జేబులు నింపుకోవడానికి పాలసీలు చేస్తే చూస్తూ ఊరుకోం బిఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. నిన్న కేటీఆర్ వేసిన ప్రశ్నలకు, నేను వేసిన 8 ప్రశ్నలకు నిజాయితీ ఉంటే సమాధానం చెప్పండి. తిట్టినా, కేసులు పెట్టినా నిన్ను వదలం రేవంత్ రెడ్డి. ప్రజల హక్కులు, ఆస్తులు కాపాడమే ప్రతిపక్షం బాధ్యత. నిన్ను నిలదీస్తూనే ఉంటం. ప్రజా క్షేత్రంలో నీ తప్పులను ఎండగడుతూనే ఉంటం.