– అసెంబ్లీ బీఆర్ఎస్ విప్ కె .పి .వివేకానంద, ఎమ్మెల్యే డాక్టర్ కె .సంజయ్
హైదరాబాద్: పెట్రోల్, డీజీల్, గ్యాస్ అవసరాలకు అనుగుణంగా లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రజలకు సరైన భరోసా ఇవ్వడం లేదు. అవసరాలకు అనుగుణంగా స్టాక్స్ పెట్టుకుని ఉంటే ప్రజలు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండేది కాదు. యూరియా కొరత తో రైతులు ఎలా ఇబ్బంది పడ్డారో చూశాం.
కేంద్ర ప్రభుత్వం తో రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం చేసుకోవడం లేదు. యుద్ధం జరుగుతున్న దేశాల్లో ఇబ్బంది లేదు. యుద్ధం లేని దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. కొరతని ముందుగా ఊహించలేక పోవడమే సమస్యకు కారణం. పెట్రోల్, డీజిల్, గ్యాస్ లేకపోతే పొద్దుగడవదు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నెపం మోపుతూ కాలం గడుపుతున్నారు. సమస్య పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి.
70 వ ట్రిప్పులో రేవంత్ ఢిల్లీ వెళ్లి వచ్చారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ తీసుకురాలేదు. ప్రజల్లో భయాందోళనకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే. రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా ప్రజల్లో భయాందోళనలకు గురిచేస్తుంది. ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వం విశ్వాసం కల్పించాలి.