Suryaa.co.in

Andhra Pradesh

హంతకులే కాదు..హత్య చేయించిన వారినీ వదలొద్దు

– లోకేష్, చంద్రబాబునూ ముద్దాయిలుగా చేర్చాలి
– సీతారామాపురంలో పసుపులేటి సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సీతారాంపురం: రాష్ట్రంలో రెండు నెలలుగా అరాచక పాలన, రావణకాష్టంలా హింసాకాండ కొనసాగుతోందని.. హత్యలు, హత్యాయత్నాలు, దాడులు దారుణంగా కొనసాగుతున్నాయని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ వెల్లడించారు. హత్య కేసుల్లో హంతకులను మాత్రమే కాకుండా, అది చేయించిన వారినీ ముద్దాయిలుగా చేర్చి, జైలుకు పంపిస్తేనే పరిస్థితి మారుతుందని ఆయన తేల్చి చెప్పారు. ఇంకా వాటికి మద్దతు ఇస్తున్న నారాలోకేష్, చంద్రబాబును కూడా ముద్దాయిలుగా చేరిస్తే తప్ప, రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ బ్రతకదని స్పష్టం చేశారు.

ప్రెస్‌మీట్‌లో వైయస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. చంద్రబాబు ఎన్నికల వేళ ఎన్నో మాటలు చెప్పారు. ప్రజలకు మోసం చేస్తూ, ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు ఆ ప్రజలంతా ప్రశ్నిస్తారన్న భయంతో, వారు ప్రశ్నించకూడదన్న ఆలోచనతో ఒక భయానక వాతావరణాన్ని రాష్ట్రవ్యాప్తంగా సృష్టిస్తున్నారు.

ఇదే పెద్దమనిషి చంద్రబాబు , ఆయన పార్టీ వారంతా ఒకటే ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో వారేం చెప్పిన మాటలు..
పిల్లలు కనిపిస్తే చాలు.. నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అని చెప్పి ప్రలోభాలకు గురి చేయడం, ఇలాంటి అక్కచెల్లెమ్మలు కనిపిస్తే నీకు రూ. 18 వేలు, అవ్వాతాతలు కనిపిస్తే రూ.4 వేల పెన్షన్, ఇలా నిరుద్యోగి కనిపిస్తే నీకు నెలకు రూ.3 వేల భృతి.. ఇంకా రైతు కనిపిస్తే నీకు రూ.20 వేలు.. సంతోషమా? అంటూ ప్రచారం చేశారు.

అదే ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరినీ మోసం చేశాడు. అదే జగన్‌ అన్న ఉండి ఉంటే, అమ్మ ఒడి కింద ప్రతి తల్లికి రూ.15 వేలు వచ్చి ఉండేవి. అది పోయింది. తల్లికి వందనం అని చెప్పి పిల్లలకు మోసం చేసి, తల్లికి పంగనామం పెట్టారు. వ్యవసాయం పనులు మొదలయ్యాయి. జగనే ఉండి ఉంటే, రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అంది ఉండేది. అవి పోయే.

చంద్రబాబు ఇస్తానన్న రూ.20 వేలు కూడా పోయాయి. అలా రైతులను మోసం చేశారు. 18 ఏళ్లు నిండిన అక్కచెల్లెమ్మలకు నెలకు రూ.1500 చొప్పున ఏటా, రూ.18 వేలు ఇస్తామని చెప్పి, వారిని కూడా మోసం చేశారు. ఇంకా.. చంపించిన వారికి మద్దతు ఇస్తున్న నారా లోకేష్, చంద్రబాబునాయుడిని కూడా ముద్దాయిలుగా చేరిస్తే తప్ప, రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ బ్రతకదు.

LEAVE A RESPONSE