– చంద్రబాబుకు ఎంతకు అమ్ముడుపోయావ్ పవన్ కళ్యాణ్..?
– జనసేనను బాబు కూలీ సేనగా మార్చేశాడు..
– బాబు వద్ద సంచి సర్దేసి సాకుల కోసం పవన్ వెంపర్లాట
– చంద్రబాబు చంకనెక్కితే ముఖ్యమంత్రి అయిపోతావా..?
– 2024లో టీడీపీ, జనసేన పార్టీలు కనుమరుగు
– ప్రజలతోనే జగన్ పొత్తు
– బాబు చంకనెక్కిన నీకు జనసైనికులే చెప్పులు చూపించాలి
– రాజకీయ పార్టీ నడపడం అంటే పెళ్లిళ్లు చేసుకోవడం లాంటిది కాదు: మంత్రి గుడివాడ అమర్నాథ్
పవర్‌స్టార్ కాదు..ప్యాకేజీ స్టార్
– రెండు రోజులుగా పొలిటికల్ టూరిస్ట్ ఏపీకి విచ్చేసి వారి పార్టీ విధానాన్ని చెప్పాడు.
– 2024 ఎన్నికల్లో ఆయన ఆలోచనల్ని చాలా వివరంగా చెప్పారు.
– ఇక రాజకీయంగా నావల్ల కాదు..నేను పార్టీని నడపలేనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశాడు.
– ఒంటరిగా పోటీ చేయలేను..నాకు ఎవరి తోడో కావాలని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు.
– నాకు తెలిసిన ఇప్పుడున్న 26 జిల్లాలకే అధ్యక్షులు లేరు..కనీసం ఉమ్మడి జిల్లాలైన 13 జిల్లాలకీ అధ్యక్షులు లేరు
– జిల్లా అధ్యక్షులే లేనప్పుడు ఈ మండలాధ్యక్షులు ఎక్కడి నుంచి వచ్చారు..?
– నా విధానం ఇది…దీన్ని మీరందరూ అంగీకరించాలని చెప్పేందుకు ఈ రోజు సమావేశం పెట్టినట్లుంది.
– మేం దాదాపు ఏడాది క్రితం నుంచి ఈయన పవర్‌స్టార్ కాదు..ప్యాకేజీ స్టార్ అని చెప్తూనే ఉన్నాం.
– ఈయన పార్టీ పెట్టిందే చంద్రబాబు కోసం అని మొదటి నుంచీ చెప్తూనే ఉన్నాం.
– మేం ఆ వాస్తవాన్ని చెప్తే ఓ రోజు కాలు చూపించాడు..మరో సారి చెప్పు చూపించాడు. ఇప్పుడేం చూపిస్తాడు..?
– ఇప్పుడు ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు చెప్పులు చూపించాలి.
– రాజకీయంగా పూర్తిగా సిగ్గు శరం వదిలేసి బట్టలొదిలేశాడు.
– ఎవరేమనుకున్నా పర్లేదు…నేను చంద్రబాబుకు అమ్ముడుపోతాను అని తేటతెల్లం చేశాడు.
– ఇంకా ఎవరికైనా అపోహలేమైనా ఉన్నాయో ఏమోనని నిన్నా, ఇవాళ నివృతి చేశాడు.
మళ్లీ చిత్తుచిత్తుగా ఓడితే వచ్చే జనం కూడా రారనే భయంతో బాబు చెంతకి:
– 140 స్థానాల్లో 2019లో పోటీ చేస్తే సుమారు 120 స్థానాల్లో డిపాజిట్లు కూడా రాలేదు.
– లింగులింగుమంటూ ఒకచోట గెలిచాడు..తాను పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయాడు.
– అప్పట్లో ఆయన ఓటింగ్ పర్సంటేజ్ 6.9 శాతం మాత్రమే వచ్చింది.
– రేపు ఒంటరిగా పోటీ చేస్తే తన బలం ఏంటో తెలిసిపోతుంది..మళ్లీ చిత్తుచిత్తుగా ఓడితే వచ్చే జనం కూడా రాకుండా పోతారనే భయంతో ఉన్నాడు.
– అందుకే చంద్రబాబు ఓటమిలో తన ఓటమిని కూడా కలిపేస్తే చంద్రబాబు వల్ల ఓడిపోయామని చెప్పుకోవచ్చని భావించాడు.
– ఓ పక్క సాకును వెతుకున్నాడు…మరో పక్క సంచి సర్దేశాడు…
– చంద్రబాబు ఎంత ఇచ్చాడనేది పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి.
– సినిమాలో నటిస్తే మీకు ఎంతిస్తారో చెప్పావు కదా…అలానే చంద్రబాబు ఎంతిచ్చాడో కూడా చెప్పాలి.
– నేను దైవాంశ సంభూతుడిని, దేవుడ్ని అని ఆవిర్భావ సభలో చెప్పాడు
– ఆ దేవుడ్ని నమ్ముకున్న భక్తులందరికీ పంగనామాలు పెట్టాడు.
– అది జనసేన కాదు..వేరే వారి జెండాలు మోసే సేనగా మారిపోయింది.
– 2019లో సీపీఐ, సీపీఎం, బీఎస్పీ జెండా మోశాడు.
– 2014లో బీజేపీ, టీడీపీ జెండా మోశాడు. 2019 నుంచి మళ్లీ బీజేపీ జెండా మోస్తున్నాడు.
– ఇప్పుడు తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి ఉంటే బాగుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మళ్లీ జెండా కూలిపని చేయడానికి సిద్ధపడిపోయాడు.
– మేం జనసైనికులు అని చెప్పుకున్న వారు ఇప్పుడు సైనికులు కాదు..జెండా కూలీలుగా మారాల్సిన పరిస్థితి వచ్చింది.
– ఆయన ఎవరి జెండా పట్టుకోమంటే ఆ జెండా పట్టుకోవడమే వారి పని.
– సీఎం కావాలని పవన్ కళ్యాణ్ లేని కోరిక మీకెందుకు..?
కాపులందర్నీ తీసుకెళ్లి తాకట్టు పెట్టడానికా..?:
– కనీసం కులాభిమానం అన్నా ఉండాలి కదా అని మాట్లాడుతున్నారు.
– కాపులందర్నీ తీసుకెళ్లి చంద్రబాబుకు తాకట్టుపెట్టడానికా..?
– ఒక పార్టీ పెట్టామంటే ప్రజల కోరికలను అధికారంలోకి వచ్చి వాటిని తీర్చడానికి.
– కానీ ఈయన పార్టీ పెట్టింది మాత్రం జగన్ ని గద్దెదించడానికే అనడానికి సిగ్గులేదా..?
– 2011లో జగన్ పార్టీ పెట్టినప్పుడు రెండు బలమైన పార్టీలు రాష్ట్రంలో లేవా..?
– అప్పుడు దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఉంది. బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు కూడా ఉన్నాయి.
– ఆ పరిస్థితుల్లో జగన్ పార్టీని స్థాపించి 8 ఏళ్లలో 151 సీట్లతో, 51 ఓట్ల శాతంలో పార్టీ అధికారంలోకి తెచ్చిన నాయకుడు జగన్ .
– అసలు జగన్‌తో నీకు పోలికేంటి..? ఏం తప్పు చేశాడని జగన్‌ని ఓడించాలి..? నాలుగు కారణాలు చెప్పాలి.
– చంద్రబాబు రాష్ట్రాన్ని నానా దరిద్రంగా తయారుచేస్తే అన్నీ మూసుకు కూర్చున్న ఈ వ్యక్తి ఇప్పుడొచ్చి జగన్‌ని ఓడిస్తాడట.
– మీకు ఒంటరిగా ఎంత ఓట్ల శాతం ఉందో తెలియాలంటే నువ్వు ముందు 175 స్థానాల్లో పోటీ చేయాలి కదా.
– ఎంఐఎంకి 7 సీట్లు, విజయకాంత్‌కు 18 సీట్లు ఇచ్చారు అంటాడు..నువ్వేం చేశావని నీకు అన్ని సీట్లు ఇస్తారు..?
– ఒక రాజకీయ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం అంటే మూడు పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కనేయడమా..?
– మాకంటే ఘోరంగా మీ పార్టీ నేతలే నీ గురించి మాట్లాడుకుంటున్నారు..
– మా భవిష్యత్తేమిటో మాకు తెలియడం లేదు అంటున్నారు..ఈరోజైనా వాళ్లు కళ్లుతెరుస్తారేమో..?
ముప్పై సీట్లు ఇస్తే ఎలా ముఖ్యమంత్రి అవుతాడో..?:
– మొన్న చంద్రబాబు ఇంటికి పెళ్లి చూపులకు వెళ్లినప్పుటి నుంచీ ఇదంతా ప్రారంభం అయ్యింది.
– ఆ రోజు ఏం మాట్లాడుకున్నాడో దాన్నంతా ఈ రోజు పార్టీ నాయకుల ముందు పెట్టి ర్యాటిఫికేషన్ అడుగుతున్నాడు.
– నాకు బలం లేదని చెప్తున్నాడు. 30 సీట్లు ఇస్తే నువ్వు ముఖ్యమంత్రి అయిపోతావా..?
– వాళ్ల వీళ్ల చంకనెక్కితే ముఖ్యమంత్రి అయిపోతావా..?
– మళ్లీ బలం లేనప్పుడు మనం ముఖ్యమంత్రి ఎలా అడుగుతాం అంటాడు. అసలు అతనికే ఒక క్లారిటీ లేదు.
– ఒక విధానం, సిద్ధాంతం లేదు..నీకెందుకు పార్టీ.
– చక్కగా సినిమాలు చేసుకుంటే బాగుంటుంది కదా..ఆ విలాసవంతమైన జీవితమే బాగుంది కదా
– ఇక్కడకు వచ్చి ప్రజల్ని, నమ్ముకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలను మోసం చేస్తున్నావు
– వీరందరినీ కట్టకట్టి టీడీపీ జెండాలు మోయించడానికా..?
– 2019 నుంచే సీరియస్ రాజకీయాలు చేస్తున్నాను అంటే యువరాజ్యంలో ఉన్నప్పుడు నువ్వు చేసింది రాజకీయం కాదా..?
– 2014 నుంచి 2019 వరకూ చేసింది రాజకీయం కాదా.?
– ప్యాకేజీలు తీసుకుని చంద్రబాబు కోసం పనిచేసినప్పుడు రాజకీయం కాదా..?
– జగన్ ముఖ్యమంత్రి అయ్యే సరికి నీకు రాజకీయం గుర్తుకువచ్చింది…సమస్యలు గుర్తుకు వచ్చాయా..?
– ముందు ఇంట్లో ఉన్న సమస్యలు తీర్చుకో…తర్వాత ప్రజల సమస్యలు తీర్చుదువు గానీ.
లోకేశ్ పాదయాత్రతో వారాహికి బ్రేక్:
– జగన్ పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమం అందిస్తుంటే ఏదో ఒక సందర్భంలో వచ్చి విమర్శించి వెళ్తాడు.
– ఇంతకీ ఆ వారాహి ఎక్కడికెళ్లింది..? లోకేశ్ పాదయాత్ర మొదలు పెట్టాడు ఆ వారాహి షెడ్‌కు వెళ్లింది.
– నన్ను చూడ్డానికి వస్తున్నారు కానీ ఓట్లు వేయడం లేదని నువ్వే చెప్తున్నావు కదా..ఎందుకు ఇక నీకు రాజకీయాలు?
– ఇంకో సారి పోటీ చేసి ఇంకోసారి ఓడిపోయి ఎందుకు కష్టాలు..?
– నీకు ఆరితేరిన, ప్రావీణ్యం ఉన్న అంశాలు కొన్ని ఉన్నాయి..దాంట్లో నిన్ను బీట్ చేసే వారు లేరు..అందులోనే వెతుక్కోవాలి.
– మనకు సంబంధం లేని అంశాల్లో దూరి సినిమా క్రేజంతా చంద్రబాబుకి అమ్మేద్దాం అంటే ఎలా..?
– ఆ సినీ స్టార్ డమ్ ప్రజల వల్ల వచ్చింది…వాళ్లని కూడా మోసం చేసేస్తావా..?
– ఏదేమైనా ఒక రాజకీయ పార్టీకి ఒక సిద్ధాతం, ఎజెండా, విధానం ఉండాలి
– నమ్ముకున్న కార్యకర్తలను భుజాన మోసే బాధ్యత ఉండాలి.
– ఇవన్నీ లేనప్పుడు ఎందుకు రాజకీయ పార్టీ.
2024లో టీడీపీ, జనసేనలు కనుమరుగు:
– 2024 ఎన్నికల తర్వాత ఒక రాజకీయ పార్టీ మాకు ప్రతిపక్షంగా ఉండబోతోంది అనుకున్నాం.
– కానీ ఒక దెబ్బకు రెండు పిట్టలు రాలబోతున్నాయి…
– 2024లో రాష్ట్రంలో వైఎస్సార్సీపీకి ప్రతిపక్షం అనేది ఉండబోదని పవన్ కళ్యాణ్ నిర్ణయంతో తేలిపోయింది.
– ఒకర్ని ఓడించడానికి పార్టీ పెట్టామని మేము ఏ రోజన్నా చెప్పామా..?
– రాజశేఖరరెడ్డి పరిపాలన మళ్లీ తెస్తామని మేం పార్టీ పెట్టాము.
– ఈ రాష్ట్రంలో ఉన్న జనసైనికులు సొంత జెండాను వదిలేసి టీడీపీ జెండా మోసే కార్మికులుగా మారుతున్నారు అని చెప్తున్నాం.
– లీగల్‌గా ఆయన బీజేపీతో ఉన్నాడు..మోడీ ని కలుస్తున్నాడు..ఢిల్లీ వెళ్లి పెద్దలను కలుస్తున్నాడు.
– ఇల్లీగల్‌గా సాయంత్రానికి చంద్రబాబు ఇంటికి వెళ్లి కలుస్తున్నాడు..
– తప్పనిసరిగా బీజేపీ కూడా దీనిపై స్పందిస్తుందని నా అభిప్రాయం.
– జగన్మోహన్రెడ్డి పొత్తు మాత్రం ఎప్పుడూ ప్రజలతోనే…