Suryaa.co.in

Andhra Pradesh

ప్రజాగర్జన కాదు, భూకబ్జాదారుల గర్జన

•  తాము సాగిస్తున్న భూకబ్జాలు, దందాలను కప్పిపుచ్చుకోవడానికే పండుకోతి విజయసాయి, ఉత్తరాంధ్రవైసీపీనేతలు గర్జనలపేరుతో ఆప్రాంతవాసుల్ని రెచ్చగొడుతున్నారు
• నెల్లూరురెడ్డి వచ్చి ఉత్తరాంధ్రపై పెత్తనంచేస్తుంటే, సిగ్గులేకుండా చప్పట్లుకొడుతున్న ఆప్రాంత అధికారపార్టీనేతలు, తాముచేసిన భూకబ్జాలను కప్పిపెట్టడానికే విశాఖ రాజధాని జపం మొదలెట్టారు.
• తన తల్లిని ఓడించారన్న కక్షతో జగన్ రెడ్డి విశాఖవాసులపై పగబట్టినట్టున్నాడు
• ప్రశాంతమైన నగరాన్నినేరాలు, భూకబ్జాలు, అరాచకాల నెలవుచేశాడు
• జగన్ యాక్షన్ కమిటీ(జేఏసీ) పేరుతో వైసీపీసూత్రధారులు, పాత్రధారులు నిర్వహిస్తున్నది ప్రజాగర్జన కాదు, భూకబ్జాదారుల గర్జన
టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యురాలు, తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత

విశాఖను రాజధానిచేయాలన్న ఆలోచన జగన్ రెడ్డికి, ఆయనప్రభుత్వానికి రావడానికి ప్రధానకారణం తనపార్టీనేతల భూకబ్జాలబాగోతం బయటిప్రపంచానికి తెలియకుండా చేయడానికేనని తెలుగుమహిళవిభాగం రాష్ట్రఅధ్యక్షురాలు, టీడీపీపొలిట్ బ్యూరోసభ్యురాలు శ్రీమతి వంగలపూడి అనిత తేల్చిచెప్పారు. గురువారం ఆమె మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆమెమాటల్లోనే మీకోసం…!

“మూడున్నరేళ్లనుంచి విచ్చలవిడిగా సాగిన వైసీపీనేతలభూదందా తనను కబళించకూడద నే జగన్ రెడ్డి కొత్తగా వికేంద్రీకరణనినాదం తెరపైకి తెచ్చి, ఉత్తరాంధ్రవాసుల్ని అమరావతి రైతులపైకి ఉసిగొల్పుతున్నాడు. వైసీపీనిర్వహిస్తున్నది ప్రజాగర్జనా… భూకబ్జాదారుల గర్జనా అని ప్రశ్నిస్తున్నాం. జేఏసీ అంటే జగన్ యాక్షన్ కమిటీ. దానిలో సూత్రధారులు, పాత్రధారులు వైసీపీనేతలే. రాష్ట్రప్రజలు, ప్రతిపక్షపార్టీలన్నీ అమరావతికి జై కొడుతుంటే, జగన్ రెడ్డి ఆయనప్రభుత్వం మాత్రమే మూడుముక్కలాట ఆడుతున్నారు. ఇప్పుడు ఉత్తుత్తిగర్జనలుచేస్తున్న విజయసాయిరెడ్డికి, ఆపార్టీనేతలకు విశాఖస్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీక రిస్తున్నప్పుడు గర్జనచేయాలనిపించలేదా? రైల్వేజోన్ సాధిస్తామంటూ రైలుబొమ్మని కారువెనకాల తగిలించుకున్న మాజీమంత్రి జోన్ సాధనకోసం ఏనాడు ఎందుకు గర్జనలు పెట్టలేదు?
నెల్లూరురెడ్డి ఉత్తరాంధ్రపై పెత్తనంచేస్తుంటే, చప్పట్లుకొడుతున్న ఆప్రాంత నేతలు సిగ్గుండే ఉత్తరాంధ్రగురించి మాట్లాడుతున్నారా? భూదోపిడీని యథేచ్చగా సాగించడానికే విశాఖ రాజధాని అంటూ, ప్రాంతాలమధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ, గర్జనలకు పిలుపునిచ్చారు.

వికేంద్రీకరణ బిల్లుని అసెంబ్లీనుంచి వెనక్కుతీసుకున్నవారు, ఇప్పుడు కొత్తగా ఆపాట పాడటం, చట్టంలోలేని వికేంద్రీకరణకోసం గర్జనలు పెట్టడం విచిత్రంగాఉంది. మూడేళ్లనుంచి విశాఖపైలేని దురద వైసీపీనేతలకు ఇప్పుడే ఎందుకు పుట్టుకొచ్చింది? వైసీపీనేతలకు అసలు ప్రేమంతా విశాఖనగరంలోనిభూములు, అక్కడున్న ఆస్తులపైనే. వాటికోసమే దొంగనాటకాలతో, ప్రజల్ని మధ్యపెట్టాలనిచూస్తున్నారు. రైతులపాదయాత్ర విజయవంత మైతే తాడేపల్లి కొంపలో వారికి బ్యాటింగ్ చేస్తారన్నభయంతోనే, వికేంద్రీకరణ పేరుతో ఉత్తరాంధ్ర వైసీపీనేతలు వీధినాటకాలు మొదలెట్టారు. విశాఖలోని లులూగ్రూప్, మెడ్ టెక్ జోన్,అదానీ డేటాసెంటర్ ను, వేలాది ఉద్యోగాలు ఇచ్చే ఐటీసంస్థలను తరిమేసినవారు ఆనగరాన్ని అభివృద్ధిచేస్తారా? విశాఖజీవీఎంసీ పరిధిలోని రోడ్లను బాగుచేయలేనివారు రాజధాని కడతారా? విశాఖలో వారుసాగిస్తున్న భూదోపిడీ ప్రజలకు తెలియకూడదనే అమరావతి రైతులపాదయాత్రపై పనిగట్టుకొనిమరీ బురద జల్లుతున్నారు.

విజయసాయి, ఎంవీవీ సత్యనారాయణలు భూదందాలో అపూర్వసహోదరులు….
పండుకోతి విజయసాయిరెడ్డి, విశాఖలోని భూయజమానుల మెడపై కత్తిపెట్టి మరీ దందాలు సాగిస్తున్నాడు. విజయసాయి దోచేసిన దసపల్లాభూములు, బేపార్క్, రాడిసన్ హోటల్, వాల్తేర్ భూదోపిడీపై తాముమాట్లాడుతుంటే, ఆయనే సొంతపార్టీ ఎంపీ ఎంవీవీ భూదందా బాగోతం బయటపెట్టాడు. విజయసాయి, ఎంవీవీ భూదందాలో అపూర్వసహోదరుల్లా వ్యవహరిస్తున్నారని ఏ2 చెప్పాకేతెలిసింది. కూర్మన్నపాలెంలోని 15లక్షలచదరపు అడుగులస్థలాన్ని డెవలప్ మెంట్ పేరుతో వైసీపీ పార్లమెంట్ సభ్యుడు ఎంవీవీ.సత్యనారాయణ కాజేశాడు. దేశంలో ఎక్కడాలేని విధంగా భూయజమానికి 1శాతం (14.400చ.అడుగులభూమి) ఎంపీకి 99శాతం వాటాఇచ్చేలా ఒప్పందంచేసుకున్నారు. 10వ తరగతి మాత్రమే చదివిన ఎంపీ, తనస్నేహితుడు, న్యాయవాది అయిన కొప్పిశెట్టి శ్రీనివాస్ తో సదరు భూమిపై కోర్టులో పిటిషన్ వేయించి, తర్వాత అతనికి కేవలం రెండుశాతం (30వేల చ.అడుగులు) వాటాఇచ్చిసరిపెట్టి అతనితో ఒప్పందంచేసుకున్నాడు. గజం భూమి రూ.లక్షవిలువచేసే, 15లక్షల చ.అడుగులస్థలాన్ని తనఖాపెట్టి, ఎల్ఐసీ సంస్థనుంచి రూ.125కోట్లు రుణం తీసుకున్నాడు. 15లక్షల చ.అడుగులభూమిని 19,61,500 చ.అడుగులుగా చూపించిన ఎంపీ ఎంవీవీ బ్యాంకుల్లో రుణంకూడా తీసుకున్నారు. సదరు భూమికి అసలు యజమానులైన వారికి తెలియకుండా వారిపేర్లతో ఎంపీనే స్వయంగా జీపీఏ తీసుకున్నాడు. (1:99 బిజినెస్ డీల్ ఒప్పందపత్రం, జీపీఏపత్రం, ఇతరడాక్యుమెంట్లను అనితగారు విలేకరులకు చూపించారు.) విశాఖలో వీధిలైట్లు వేయలేని వైసీపీనేతలు, అంగుళంభూమి వదలకుండా ఆనగరాన్ని కబ్జాలకేంద్రంగా మార్చారు. ఉత్తరాంధ్రని అభివృద్ధిచేస్తామంటూ, విశాఖభూదోపిడీని తెరమరుగుచేయాలని చూస్తున్నారు.

అమరావతి రైతులపాదయాత్ర విజయవంతమైతే, ఉత్తరాంధ్ర వైసీపీనేతలు, మంత్రులకు తాడేపల్లి కొంపలో బ్యాటింగ్ పడుతుందన్నభయంతోనే ఈవిధమైన కుట్రలకు పాల్పడు తున్నారు. విశాఖలోని ప్రభుత్వఆస్తుల్ని తాకట్టుపెట్టినవారు, ఆప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారా? విశాఖపట్నం కలెక్టరేట్, పాలిటెక్నిక్, ప్రభుత్వకళాశాలలు, డైరీఫామ్, పోలీస్ క్వార్టర్స్, గవర్నమెంట్ సర్క్యూట్ హౌస్, పీడబ్ల్యూడీ ఆఫీస్, తహసీల్దార్ కార్యాలయం ఇలా దాదాపు 200ఎకరాలకు పైగా భూముల్ని తాకట్టుపెట్టడమేనా వైసీపీనేతలు, ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి వికేంద్రీకరణ? న్యాయస్థానం అనుమతితో పాదయాత్ర చేస్తున్న రైతులపై ఒకకర్రలేపితే, వందకర్రలు లేస్తాయని గుర్తుంచుకోండి. ఎన్నిపిచ్చికుక్కలు మొరిగినా అమరావతిరైతుల పాదయాత్ర విజయవం తమై తీరుతుంది. రాజధానిగా అమరావతే చరిత్రలో నిలిచిపోతుంది” అని అనిత స్పష్టంచేశారు.

LEAVE A RESPONSE