– ధరల స్ధిరీకరణ నిధీ లేదూ, ప్రణాళికా లేదు
– రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఎకరా రూ.99 పైసలకే సంతర్పణ
– దేశ చరిత్రలో మరే ప్రభుత్వమూ ఇలా చేయలేదు
– మీ విశ్వనగరం అమరావతిలో భూమిలివ్వడం లేదేం
– కాకినాడలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయస్సార్సీపీ ఉత్తరాంధ్రా జిల్లాల సమన్వయకర్త, మాజీ మంత్రి కురసాల కన్నబాబు
కాకినాడ: 18 నెలల పాలనలో రైతును నిలువునా ముంచిన చంద్రబాబు ప్రభుత్వం.. పంచ సూత్రాల పేరుతో పచ్చి అబద్దాలు చెబుతున్నారని వైయస్సార్సీపీ ఉత్తరాంధ్రా ప్రాంతీయ సమన్వయకర్త, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పండించిన పంటకు దిక్కూ మొక్కూ లేదు కానీ పంచ సూత్రాల పేరుతో రైతన్నా మీకోం అని తయారై ఇంటింటికీ తిరుగుతూ ఏం చేయబోతున్నారు. రైతు పండించిన పంటకు దిక్కులేదు కానీ పంచసూత్రాల పేరుతో ప్రచారానికి మాత్రం తయారయ్యారు. 18 నెలల కాలంలో ఒక్క రైతును కూడా మీరు ఆదుకోలేదు. టమోట పంటను రైతులు ధర లేకపోవడంతో కోయలేక వదిలిపెట్టారు.
మామిడికి ధరలేదు, మద్ధతు ధర ఇస్తామని ఇవ్వలేదు. మొక్క జొన్న రైతులైతే దిక్కుతోచని స్ధితిలోకి వెళ్లిపోయారు. పశ్చిమగోదావరి నుంచి శ్రీకాకుళం వరకు అధికంగా మొక్కజొన్న పండిస్తారు. వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలో మొక్కజొన్న క్వింటాళ్లకి రూ.2300 నుంచి రూ.2400 కొంటే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కేవలం రూ.1700 మాత్రమే ధర పలుకుతుంది. బత్తాయి రైతులు సర్వనాశనం అయిపోయారు. మార్కెట్ లో కనీస ధరకు కూడా అడిగే పరిస్థితి లేదు. చివరకిరైతులు బత్తాయి తోటలను తెలిగిస్తున్నారు. ఉల్లి రైతులైతే పంట తొలగిస్తున్నారు. తీత ఖర్చులు కూడా రావు. అరటి పంట విషయంలో ప్రభుత్వం మరీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది.
ధర లేదు అంటే ఢిల్లీలో ఉన్న వ్యాపారులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మా రైతుల దగ్గర అరటి కొనండని బ్రతుమాలుతోంది. మీ హయాంలో అసలు ధరలస్ధిరీకరణ కోసం నిధి లేదూ, ప్రణాళిక కూడా లేదు. అరటి గడిచిన మూడేళ్లలో సగటున వైయస్సార్సీపీ ప్రభుత్వంలో టన్నుకు రూ.25 వేలు పలికితే… ఇప్పుడు టన్ను రూ.500, కేజీ రూ.50 పైసలు పలుకుతోంది. కనీసం కోత ఖర్చులు అయినా వస్తాయా? ధాన్యం మద్ధతుధర 75 కేజీలకు మా హయాంలో కన్నా ఇప్పుడు రూ.300-రూ.400 తక్కువ ధరకు కొంటున్నారు. మొక్కజొన్న సగటున గత మూడేళ్లలో రూ.2300 నుంచి రూ.2090 ఉంటే ఇప్పుడు రూ.1200- రూ.1700 ఉంది. పత్తి ఎంఎస్పీ మా హయాంలో క్వింటాళ్ కి రూ.7020 ఉంటే.. ఈరోజు రూ.4500 నుంచి రూ.5000 ఉంది. వేరుశెనగా మా ప్రభుత్వ హయాంలో 6370 ఉంటే ఇవాళ రూ.4000 నుంచి రూ.4300 ఉంది. వైయస్.జగన్ ముఖ్యంత్రిగా ఉన్నప్పుడు వరికోత యంత్రాల అద్దెలను కూడా నియంత్రించాం.
గంటకు రూ.2500 ఉంటే ఇప్పుడు రూ.4000- రూ.4500 వసూలు చేస్తున్నారు. ఇదీ రాష్ట్రంలో పరిస్థితి.ఉచిత పంటల బీమా రద్దు, సున్నా వడ్డీకి ఎగనామం, ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాలన్న విషయాన్ని మర్చిపోయారు. ప్రకృతి విపత్తుల కన్నా, రైతులకు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం చేసే నష్టమే ఎక్కువగా ఉంది. చివరికి యూరియా రైతులకు సక్రమంగా సరఫరా లేదు, .. .ఒక బస్తా యూరియా కూడా రైతులకు ఇవ్వడంలో మీరు విఫలమయ్యారు కోనసీమలో కొబ్బరిరైతులు రేటు పెరిగిందని ఆనందపడేలోపే కొబ్బరి రేటు అనూహ్యంగా పడిపోయింది. అంబాజీ పేట మార్కెట్ లో నెల రోజుల వ్యవధిలో 1000 కాయిలకు రూ.9వేలు ధర తగ్గింది. ప్రభుత్వం కనీసం జోక్యం చేసుకోలేదు. గత నెలలో ఇదే సమయానికి 1000 కాయిలకు రూ.23-రూ.24 వేలు ఉండే ధర… రూ.9వేలు తగ్గిపోయింది.
కనీసం నాఫెడ్ కి లేఖ రాసి మా కొబ్బరి కొనండని లేఖ కూడా రాయలేదు. రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. మీరు మామిడి రైతులకు కేజీ రూ.4 సబ్సిడీ అదనంగా ఇస్తామన్నారు. ఎంత మంది రైతులకు ఇచ్చారు? ఎన్ని టన్నులకు ఇచ్చారు? ఆ వివరాలు ఉంటే ఇంటింటికీ వెల్లి చూపించండి. మనుషులతో, ప్రజల ఎమోషన్స్ తో చంద్రబాబురాజకీయం చేస్తున్నారు. తుపాన్ వస్తే అగ్గిపెట్టలు, కొవ్వెత్తులు సరఫరా చేయడం, యోగా డే వస్తే మ్యాట్ లు సరఫరా చేయడం, పుష్కరాలు వస్తే ముక్కులు పెట్టించడం, వరద వచ్చినా, తుపాను వచ్చినా పండగ చేసుకోవడం మీ కలవాటు. . రియల్ ఎస్టేట్ కంపెనీలకు కూడా ఎకరా రూ.99 పైసలకే కట్టబెడుతున్నారు.
దేశ చరిత్రలో రూ.99 పైసలకే ఎకరాలకు ఎకరా పంచిన ప్రభుత్వం మరొక్కటి లేదు. అదేమిటని ప్రశ్నిస్తే పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు అని చెప్తారు ఇదో పెద్ద స్కామ్. విశాఖలో భూముల ధారాదత్తం చేయడం ఏమిటి? మీరు అభివృద్ధి చేస్తున్న అంతర్జాతీయ నగరం అమరావతిలో భూములు కేటాయించవచ్చు కదా? విశాఖలో భూకంపాలు వస్తాయని, సునామీలు, తుపాన్ లు వస్తాయని మన పత్రికల్లోను కధనాలు రాశారు కదా? ఇప్పుడు రావా? మీ శిల్పి చెక్కిన మహనగరం అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ఏ మహానుభావుడు ఎందుకు ముందుకు రావడం లేదు? వైజాగ్ కే ఎందుకు వస్తున్నారు?