Suryaa.co.in

Editorial

జిత్వానీ కేసులో ధనంజయరెడ్డి, రాజేంద్రనాధ్‌రెడ్డికీ నోటీసులు?

– ధనంజయరెడ్డి చాంబరులోనే ఐపిఎస్‌ల చర్చలు
– సజ్జల, పీఎస్సార్, రాణా, గున్నీ అక్కడే
– ముంబయికి వెళుతున్న సమాచారాన్ని డీజీపీకి ఇచ్చిన గున్నీ?
– వెళ్లమని అనుమతించిన డీజీపీ రాజేంద్రనాధ్‌రెడ్డి
– కలసి సమన్వయం చేసుకోవాలని సూచించిన ధనంజయరెడ్డి, సజ్జల?
– విచారణ అధికారికి పూసగుచ్చినట్లు వివరించిన గున్నీ?
– ఇక ధనంజయరెడ్డి, రాజేంద్రనాధ్‌రెడ్డికి నోటీసులే తరువాయి
( మార్తి సుబ్రహ్మణ్యం)

పోలీసుశాఖలో సంచలనం సృష్టిస్తోన్న ముంబయి నటి జిత్వానీ కేసు కొత్త మలుపుతిరిగింది. ముంబయి నుంచి ఆమె కుటుంబాన్ని అరెస్టు చేసి, కోర్టు అనుమతితో విజయవాడకు తీసుకువచ్చిన వ్యవహారంలో, ఇప్పటికే ముగ్గురు ఐపిఎస్ అధికారులు సస్పెండ్ కాగా.. నాటి సీఎంఓలో అన్నీ తానై వ్యవహరించిన సీఎం అదనపు కార్యదర్శి ధనంజయరెడ్డి, అప్పటి డీజీపీ రాజేంద్రనాధ్‌రెడ్డి పాత్ర కొత్తగా తెరపైకి రావడం పోలీసువర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నాటి నిఘా దళపతి పీఎస్సార్ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణా, డిసిపి విశాల్‌గున్నీ కలసి తాడేపల్లిలోకి జగన్ క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. అక్కడే జిత్వానీ అరెస్టు అంశంపై చర్చ జరిగినట్లు తెలిసింది. ప్రభుత్వ పరంగా కావలసిన సహకారం అందిస్తామని ధనంజయ, సజ్జల వారికి భరోసా ఇచ్చారంటున్నారు.

ఇక ఆ విషయాన్ని బయటకు వచ్చిన గున్నీ, డీజీపీ రాజేంద్రనాధ్‌రెడ్డికి ఫోన్‌లో వివరించారట. దానికి ఆయన కూడా వెళ్లిరమ్మని ఆదేశించినట్లు, గున్నీ విచారాణాధికారికి చెప్పినట్లు పోలీసు వర్గాల సమాచారం. దీనితో ఈ కేసులో రిటైరైన ఐఏఎస్ అధికారి ధనంజయరెడ్డి, మాజీ డీజీపీ రాజేంద్రనాధ్‌రెడ్డికి నోటీసు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.

LEAVE A RESPONSE