Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసానికి నోటీసులు

– గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కు తాడికొండ ఎన్నికల రిట ర్నింగ్ అధికారి(ఆర్వో) ఎం.గంగరాజు నోటీసు లు
– వివరణ పంపిన పెమ్మసాని

ఈ నెల 25న తాడికొండ మం డలం లాం గ్రామంలో నిర్వహించిన టీడీపీ ప్రచార సభలో పెమ్మసాని మాట్లాడుతూ సద్దాం హుస్సేన్ బంకర్లో దాక్కొని ఉంటే తీసుకొచ్చి కుక్కను కొట్టినట్లు కొట్టి చంపారని చెప్పారు.

దీనిపై ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, ముస్లిం హ క్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా వేర్వేరుగా గుంటూరు జిల్లా ఎస్పీతోపా టు తాడికొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు.

పెమ్మసాని చంద్రశేఖర్ ఓ వర్గం ఓట్లను చీల్చేందుకు ముస్లింల మనోభా వాలను దెబ్బతీసేలా ఉద్దేశపూర్వకంగా అవా స్తవాలను ప్రచారం చేస్తున్నారని తమ ఫిర్యా దుల్లో పేర్కొన్నారు. వివరణ ఇవ్వాలంటూ పెమ్మసాని చంద్రశేఖర్కు ఆర్వో నోటీసులు జారీ. దీనిపై చంద్రశేఖర్ శుక్రవారం సాయంత్రం తన వివరణను ఆర్వోకు పంపారు

LEAVE A RESPONSE