– ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు బల్క్ డ్రగ్ పార్క్ ఎందుకు పెట్టాలి?
– ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వద్దన్న పార్కు ఇప్పుడు ముద్దు ఎందుకు అయింది?
– హోంమంత్రి అనితను నిలదీసిన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ
– ఎన్నికలకు ముందు బల్క్ డ్రగ్ పార్కును వ్యతిరేకించిన హోంమంత్రి అనిత
– బల్క్ డ్రగ్ పార్కు వలన క్యాన్సర్ వస్తుందంటూ ప్రచారం
– ఇప్పుడు మాట మార్చిన హోంమంత్రి
– బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక పోరాట కమిటీపై అక్రమ కేసులు
– మాజీ మంత్రి కురసాల కన్నబాబు హామీ
రాజయ్యపేట గ్రామస్ధులకు అండగా వైయస్సార్సీపీ
– అనకాపల్లి జిల్లాఅధ్యక్షుడు గుడివాడ అమర్నాధ్
అనకాపల్లి: నక్కపల్లి మండలంలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైయస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్కు కు వ్యతికంగా ఆందోళన చేస్తున్న రైతులును వైయస్సార్సీపీ నేతలు, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైయస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త కురసాల కన్నబాబు, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాధ్, పలువురు వైయస్సార్సీపీ నేతలు పరామర్శించారు. వారి పోరాటానికి సంఘీభావం తెలిపారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటును వ్యతిరేకించిన టీడీపీ నేతలు అధికారంలోకి రాగానే మాట మార్చడం ఎంత వరకు సబబు అని నిలదీశారు. పరిశ్రమల ఏర్పాటుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని… అయితే స్థానికులను ఒప్పించి వారికి న్యాయం చేసిన తర్వాతే ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. బల్క్ డ్రగ్ పార్టు బాధితుల పోరాటానికి వైయస్సార్సీపీ అండగా ఉంటూ వారికి న్యాయం జరగడానికి ఏ స్ధాయిపోరాటానికైనా సిద్దమేనని వైయస్సార్సీపీ నేతలు చెప్పారు.
ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు బల్క్ డ్రగ్ పార్క్ ఎందుకు పెట్టాలి? బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున సంఘీభావం తెలిపేందుకు ఇక్కడికి వచ్చాం. రైతుల పోరాటానికి అవసరమైన మా పార్టీ అధ్యక్షులు వైయస్.జగన్ కూడా వచ్చి వారి అండగా నిలబడతారు. ఒకవైపు హోంమంత్రి పనులు నిలిపివేస్తామని రైతులకు హామీ ఇచ్చినా.. పనులు ఎక్కడా ఆగడం లేదంటే… హోంమంత్రి మాటకు ఉన్న విలువెంతో తెలుస్తోంది.
టీడీపీ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బల్క్ డ్రగ్ పార్కుకు వస్తే ఈ ప్రాంతంలో అనారోగ్య సమస్యలు వస్తాయని, ప్రజలను చనిపోతారని చెప్పి… ఇప్పుడు అధికారంలోకివచ్చిన తర్వాత మాట మార్చడం ఎంత వరకు సబబు? లేదంటే ఆ రోజు అబద్దం చెప్పాను అని అంగీకరించాలి. బాధ్యత గల నాయకులుగా ఇదేరకమైన మాట తీరు? టీడీపీ నేతలు ప్రజలకు సమాధానం చెప్పి తీరాల్సిందే. బల్క్ డ్రగ్ పార్ట్ ఏర్పాటు రాజయ్యపేట ప్రజల అభీష్టం ప్రకారం జరగాల్సిందేనని మండలి విపక్ష నేత బొత్స చెప్పారు.
ఒకవైపు ఫార్మా కంపనీలతో సముద్రం అంతా కలుషితం అయిపోయిందని మత్స్యకారులు ఆందోళన చెందుతున్న సమయంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం దారుణం. హోంమంత్రి అనిత గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు .. ఈ ప్రాంతంలో బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ వస్తే పిల్లలు పుట్టరని, పుట్టినా వ్యాధులతో పుడతారని, క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయని, కిడ్నీలు పాడవుతాయని చెప్పారు. ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత బల్క్ డ్రగ్స్ పార్క్ వల్ల సక్రమమైన పిల్లలు పుడతారా ? ఎలాంటి రోగాలు రావు సరికదా ఉన్న రోగాలు పోతాయని చెబుతారా? అధికారంలో లేనప్పుడు ఒకలా, ఉన్నప్పుడు మరొకలా మాట్లాడటం ఎంత వరకు సమంజసం.