Suryaa.co.in

Andhra Pradesh

ఎన్నారైలు రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవాలి

-ఫాంగ్ టెక్ ల్యాబ్ ఐ. టి. ట్రైనింగ్ సెంటర్ ప్రారంభోత్సవంలో పెమ్మసాని పిలుపు

గుంటూరు: ‘అమెరికాలో స్థిరపడ్డ ప్రవాస భారతీయులు ఆంధ్రప్రదేశ్ కు వచ్చి రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవాలి. మరెందరికో స్ఫూర్తిగా నిలవాలి. ఐ.టి., ఇతర సాంకేతిక రంగాల్లో స్థిరపడాలనుకునే విద్యార్థులకు మద్దతుగా ఉండాలి.’ అని గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు అన్నారు.

గుంటూరులోని స్థానిక బృందావన్ గార్డెన్స్ లో ఫాంగ్ టెక్ ల్యాబ్ ఐటీ ట్రైనింగ్ సెంటర్ ను పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆదివారం ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం సంస్థ నిర్వాహకులు జాగర్లమూడి వెంకట్ ట్రైనింగ్ సెంటర్ వివరాలను పెమ్మసాని గారికి వివరించారు. అనంతరం కేంద్ర సహాయ మంత్రి మాట్లాడుతూ అమెరికాకు వెళ్లాలనుకునే విద్యార్థిని, విద్యార్థులకు ఐ.టీ రంగంలో మరింత నైపుణ్యతతో కూడిన కోచింగ్ ను అందించడంలో భాగంగా ఈ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

సరైన గైడెన్స్ లేక అమెరికా వెళ్లిన విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి కంపెనీలలో ట్రైనింగ్ తీసుకుని వెళితే అమెరికాలో ఇబ్బందులు పడాల్సిన అవసరం రాదని తెలిపారు. ఒక ప్లానింగ్ ప్రకారం మూడు నెలలకు ఒకసారి 50 మందికి ప్యాకేజ్ గా శిక్షణ అందిస్తారని పెమ్మసాని అన్నారు. 50 మందితో ప్రారంభమైన ఈ ట్రైనింగ్ సెంటర్ 500 మందికి చేరాలని కోరుకుంటున్నాను అని తెలుపుతూ నిర్వాహకులు వెంకట్ కు పెమ్మసాని అభినందనలు తెలియజేశారు.

LEAVE A RESPONSE