ఆంధ్రప్రదేశ్‌కు సరఫరా చేస్తున్న 2 వేల మెగావాట్ల విద్యుత్ ను నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నిలిపివేసింది. అయితే 600 మెగావాట్ల విద్యుత్‌ను మాత్రమే నిలిపినట్లు అధికార వ ర్గాలు చెబుతున్నాయి.
తమకు రావాల్సిన బకాయిలు చెల్లించడంలో.. ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర అధికారులు విద్యుత్ లోటును ఆర్ టి పి పి ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించారు. మరో యూనిట్‌ను ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు.
అయితే అందుకు సరిపడా బొగ్గు నిల్వలు లేవని ఆర్ టి పిపి స్పష్టం చేయడంతో ఇందనశాఖ అధికారులు అయోమయంలో పడ్డారు. కాగా ప్రస్తుతం ఐదు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది.