హైదరాబాద్: అఖిల భారత ఎన్టీఆర్ అభిమానుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిన్నమనేని సాయిబాబా శనివారం మృతి చెందారు. ఆయన ఎన్టీఆర్ ఫాన్స్ ప్రెసిడెంట్‌గా సుపరిచితుడు.
సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న సాయిబాబా, సుదీర్ఘకాలం పార్టీ ప్రధాన కార్యాలయంలో చురుకుగా పనిచేశారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జరిగిన అనేక ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు. ఆయన గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు.
కాగా సాయిబాబా మృతిపై టీడీపీ సీనియర్ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాయిబాబా మృతి టీడీపీకి మాత్రమే కాకుండా, తమకు వ్యక్తిగతంగా లోటని.. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ టిడి జనార్దన్, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మాజీ ఎంపి గరికపాటి మోహన్‌రావు, మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మాజీ ఎంపి అల్లాడి రాజ్‌కుమార్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఏపీ గ్రంధాలయ సంస్థ చైర్మన్ జి.కోటేశ్వరరావు, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవిందకుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, టీడీపీ సీనియర్ నేత కొమ్మినేని సాయి వికాస్, నగర టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల కిశోర్‌కుమార్, సీనియర్ నేత నైషధం సత్యనారాయణమూర్తి, కాంగ్రెస్ నేత బిఎన్‌రెడ్డి, టీఆర్ఎస్ నేత ఎమ్మెన్ శ్రీనివాసరావు, షకీలారెడ్డి, బిజెపి నేత మేకల సారంగపాణి తదితరులు నివాళులర్పించారు.