Suryaa.co.in

Telangana

ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులకు ఎన్టీఆర్ సావనీర్ కమిటీ ఆహ్వానం

నందమూరి తారక రామారావు శతజయంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్‌ లిటరేచర్‌, సావనీర్‌ అండ్‌ వెబ్‌సైట్‌ కమిటీ మే 20 సాయంత్రం 5 గం॥లకు హైదరాబాద్‌, కూకట్‌పల్లి, హౌసింగ్‌ బోర్డులోగల కైతలాపూర్‌ మైదానంలో ఎన్టీఆర్‌పై ప్రత్యేకంగా రూపొందించిన శకపురుషుడు సావనీర్‌, ‘జయహో ఎన్టీఆర్‌’ వెబ్‌సైట్‌ల ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తోంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అతిధులుగా ఎన్‌.టి.రామారావు గారి కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానించడం జరుగుతోంది. ఎన్టీఆర్‌ కుమారులు నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ సహకారంతో , ఎన్టీఆర్ సావనీర్ కమిటీ చైర్మన్‌ టి.డి.జనార్థన్‌… డాక్టర్‌ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందీశ్వరి , జూనియర్‌ ఎన్టీఆర్‌, నందమూరి జయకృష్ణ , నందమూరి మోహనకృష్ణ , గారపాటి లోకేశ్వరి , కంఠంనేని ఉమాశ్రీనివాస్‌ ప్రసాద్‌ , నందమూరి కళ్యాణ్‌ చక్రవర్తి , నందమూరి కళ్యాణ్‌రామ్‌,కాట్రగడ్డ రుక్మాంగదరావు (ఎన్టీఆర్‌ గారి బావమరిది) , ఇంకా ఇతర కుటుంబ సభ్యులను కలిసి ఆహ్వాన పత్రాలు అందించి వారందరూ తమ కుటుంబ సభ్యులతో సహా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరడం జరిగింది.

LEAVE A RESPONSE