Suryaa.co.in

Telangana

చంద్రబాబుతో ఎన్టీఆర్ సావనీర్, లిటరేచర్, వెబ్ సైట్ కమిటీ సభ్యుల భేటీ

ఎన్టీఆర్ సావనీర్, లిటరేచర్, వెబ్ సైట్ కమిటీ సభ్యులు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తో హైదరాబాద్ లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 20వ తేదీన ఎన్టీఆర్ పై ప్రత్యేక సంచికను, వెబ్ సైట్ ను ఆవిష్కరిస్తున్నారు. హైదరాబాద్ KPHB లోని ఖైతలాపూర్ గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కార్యక్రమ నిర్వహణపై కమిటీ సభ్యులు చంద్రబాబు నాయుడు గారితో సమావేశం అయ్యి చర్చించారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ టిడి జనార్థన్. కార్యక్రమ నిర్వహణను చంద్రబాబు నాయుడు కి వివరించారు. పార్టీ అధినేత చంద్రబాబు ఈ సందర్భం గా కమిటీకి పలు సూచనలు చేశారు.

LEAVE A RESPONSE