-ముఖ్యమంత్రికి విన్నవించిన పద్మభూషణ్ అచార్య యార్లగడ్డ
-తెలుగు విశ్వవిద్యాలయానికి రూ.50 కోట్లు మంజూరు అభినందనీయం
-ఎన్ టి ఆర్ మానస పుత్రికగా ఆవిర్భవించిన తెలుగు విశ్వవిద్యాలయం
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు రూ.50 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించటం అభినందనీయమని పద్మభూషణ్ అచార్య లక్ష్మి ప్రసాద్ పేర్కొన్నారు.
విశ్వ హిందీ పరిషత్తు అధ్యక్షుని హోదాలో అమెరికా పర్యటనలో ఉన్న యార్లగడ్డ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ గతంలో చంద్రబాబు నాయిడు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేస్తూ రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి, దానికి మూర్తిభవించిన తెలుగుదనంగా నిలిచే దివంగత నందమూరి తారక రామారావు పేరు పెట్టాలని విన్నవించారు.
సమైక్య రాష్ట్రంలో ఎన్టీఆర్ మానసపుత్రికగా తెలుగు విశ్వవిద్యాలయం ఆవిర్బహించిందని, దానికి కులపతిగా కూడా ఆయనే వ్యవహరించారని గుర్తు చేసుకున్నారు. తెలుగు, అంబేద్కర్ యూనివర్సిటీలు రాష్ట్రంలో ఏర్పటు దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవటం శుభపరిణామమని అచార్య యార్లగడ్డ తెలిపారు. ఈ విశ్వవిద్యాలయాలను రాష్ట్ర విభజన తర్వాత మన రాష్ట్రంలో ఏర్పాటు చేసుకో లేకపోవడం వల్ల ఇక్కడి విద్యార్ధులు చాలా నష్టపోయారని, చంద్రబాబు నాయిడు దానిని సరిదిద్దుతూ తీసుకున్న తాజా నిర్ణయం తెలుగు భాసాభిమానులకు ఆనందదాయకమన్నారు.
నాటి గోదావరి పుష్కరాల చివరి రోజున రాజమండ్రిలో జరిగిన ఉత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మారుస్తామని, తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాజమండ్రిలో ఏర్పాటు చేస్తామని చెప్పారని గుర్తు చేసారు. రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయానికి 35 ఎకరాలు భూమి, తగిన భవనాలు కూడా అందుబాటులో ఉన్నాయని అచార్య యార్లగడ్డ వివరించారు.