తెలుగుదేశం ఫోరం సింగపూర్ ఆధ్వర్యంలో, తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన దివంగత నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని రాయచోటి, ఒంగోలు, రాజాం ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా సింగపూర్‌లోని సరిగమ గ్రాండ్ రెస్టారెంట్ & బిస్ట్రోలో ఏర్పాటు చేసిన స్మరణ కార్యక్రమంలో తెలుగుదేశం ఫోరం సింగపూర్ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై అన్నకి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి సరిగమ గ్రాండ్ రెస్టారెంట్ & బిస్ట్రో వారు ఆతిథ్య విందును ఏర్పాటు చేసి తమ సామాజిక బాధ్యతను చాటుకున్నారు.