Suryaa.co.in

Telangana

చెంచు చిన్నారులు, కిశోర బాలికల సంక్షేమంతోపాటు పౌష్టికాహారం

-డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన -సచివాలయంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల -మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష
.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ….. చెంచు చిన్నారులు, కిశోర బాలికల సంక్షేమంతోపాటు వారికి పౌష్టికాహారం అందించే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ‘గిరి పోషణ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మంత్రి సత్యవతి రాథోడ్ గారు అన్నారు. వారిలో ఎదుగుదల లోపాన్ని అధిగమించేందుకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం పంపిణీ మరింత సమర్థవంతంగా అందించేలా చర్యలు చేపట్టాలని మంత్రి అన్నారు.

గిరిజన ప్రాంతాల్లో బాల్య వివాహాలు పూర్తిగా తగ్గాయని మారు మూల ప్రాంతాల్లో అధికారులతో మరింత అవగాహన చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రజలు బాల్య వివాహాలపై అవగాహన కలిగి ఉన్నప్పుడే తప్పిదాలు జరగవని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకంతో బాల్య వివాహాలు బ్రేక్ పడిందని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి’తో పేద ఆడబిడ్డల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని అని స్పష్టం చేశారు.

అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లలో పిల్లల హాజరు వందశాతం ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు సైతం అంగన్వాడీ కేంద్రానికి వచ్చి పౌష్టికాహారం తినివెళ్ళేవిధంగా వారికి అవగాహన కల్పించాలని సూచించారు. వయసుకు తగ్గ ఎత్తు బరువు లేని పిల్లల విషయంలో బరువులు, ఎత్తులు సరిగ్గా ఉండేలా చూసి, బరువు తక్కువ ఉన్న పిల్లలకు మరింత పట్టిష్టమైన పౌష్టికాహారాన్ని అందించే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పరిశుభ్రత పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఈ సమీక్షలో సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ మరియు గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి భారతి హోలీకేరిలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE