Suryaa.co.in

Telangana

తెరాస నీతిమాలిన రాజకీయాలు

– మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ లో జరిగిన బిజెపి మీడియా సమావేశంలో బిజెపి తెలంగాణ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర దిగ్విజయంగా ముందుకు సాగుసాగుతోంది. ప్రజా సంగ్రామ యాత్రని తెరాస నాయకులు అధికారులతో కలిసి అనేక సందర్భాల్లో, అనేక రకాలుగా అడ్డుకోవాలని చూశారని అయినా సరే ప్రజలు దానిని తిప్పికొట్టి సంగ్రామ యాత్రని విజయవంతం చేస్తున్నారన్నారు.

హైదరాబాద్ నుండి యాత్రలో పాల్గొనడానికి వస్తున్న బిజెపి నాయకులను సైతం బీజేపీ జెండాలు చూసి, పోలీస్ అధికారులు కార్ల చెకింగ్ పేర్లతో సమయాన్ని వృధా చేయడం కూడా దారుణమన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి గ్రామ గ్రామానికి చేరుతూ ఉండడం, ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ప్రజలకి మోడీ గారు సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఉండడంతో ,తెరాస పార్టీ నిర్లక్ష్య పరిపాలన బయటపడుతుందనే భావనతో తెరాస పార్టీ అనేక రకాలుగా బీజేపీ పార్టీని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది.

అలాగే కాంగ్రెస్ పార్టీ మరియు తెరాస పార్టీలు పొత్తు పెట్టుకోవడం,సీట్లు పంచుకోవడం మీద దృష్టి సారించి, పరిపాలనని, అభివృద్ధిని గాలికొదిలేశారు. 2023 లో బిజెపి పార్టీ కచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో విజయం సాధిస్తుందని ఆందోళనతోనే తెరాస పార్టీ ఇప్పటి నుండే కొత్త పొత్తుల కోసం వెంపర్లాడుతున్నది.

కేవలం డబ్బులు కోసం పనిచేసే ప్రశాంత్ కిషోర్ లాంటి కార్పొరేట్ వ్యక్తుల్ని రాజకీయాల్లో తీసుకువచ్చి , తెలంగాణ రాష్ట్రాన్ని మరింతగా బ్రష్టు పట్టించాలని చూస్తున్న కేసీఆర్ కి ప్రజలే బుద్ధి చెప్పాలి.
తెరాస పార్టీ విధానాలు చూస్తుంటే తెరాస పార్టీలో ఉన్న నాయకులకే చిరాకొస్తుంది.

వారిని ఆత్మవిమర్శ చేసుకునే స్థాయికి కేసీఆర్ ప్రవర్తించడం నిజంగా సిగ్గుచేటు. ఇక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడా లేక టిఆర్ఎస్ పార్టీ కోవర్టా అన్నది అర్థం కావట్లేదు. నీతిమాలిన రాజకీయాలు చేసే తెరాసకి అలాగే కాంగ్రెస్ కి ప్రజలు బుద్ధి చెప్పే రోజు అతి తొందరలోనే ఉంది అని అన్నారు.

LEAVE A RESPONSE