హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని ప్రభుత్వం ఆ విధుల నుంచి రిలీవ్ చేసింది. ఆయన స్థానంలో సర్ఫరాజ్ అహ్మద్ కు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఎన్వీఎస్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ పట్టణ రవాణా సలహాదారుగా ఆయన రెండేళ్ల పాటు కొనసాగ నున్నారు.