Suryaa.co.in

Andhra Pradesh

కాపులకు ఓబీసీ రిజర్వేషన్ అమలు చేయాల్సిందే

– ఇద్దరు కాపులను అధ్యక్షులుగా నియమించి చిత్తశుద్ధి బీజేపీది
– పార్లమెంటులో కాపుల రిజర్వేషన్ అంశం లేవనెత్తిన జీవీఎల్

కాపులకు ఓబీసీ రిజర్వేషన్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాజ్య సభ జీరో అవర్‌లో ఎంపీ జీవీఎల్ డిమాండ్ చేశారు.కాపుల రిజర్వేషన్‌పై జీవీఎల్ ఏమన్నారంటే..

ఆంధ్రప్రదేశ్‌లో కాపులు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన సమాజం. ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి కాపులు చాలా విశేష కృషి చేశారు కానీ ఆంధ్రప్రదేశ్ జనాభాలో 18% ఉన్న కాపులకు అభివృద్ధి ఫలాలు అందడం లేదు.

బ్రిటిష్ పాలనలో, కాపులను వెనుకబడిన తరగతులుగా పరిగణించారు (1915 జిఓ నెం.67 ప్రకారం) కానీ 1956లో నీలం సంజీవ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ జాబితా నుండి వారిని తొలగించారు. 1956 నుంచి కాపులకు రాజకీయంగా అధికారం లేదన్న కారణంగా అన్ని ప్రభుత్వాలు కాపులకు అన్యాయం చేశాయి.

విద్యాపరంగా, సామాజికంగా ఆర్థికంగా బలహీనంగా ఉన్న కాపులు రిజర్వేషన్ల కోసం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. రెండు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్‌లో కాపు రిజర్వేషన్ల కోసం తీవ్ర రాజకీయ ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.

2017లో ఆంధ్రప్రదేశ్‌లోని విద్యాసంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కాపులకు 5% రిజర్వేషన్లు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ కాపు రిజర్వేషన్ బిల్లు, 2017 పేరుతో ఏపీ రాష్ట్ర అసెంబ్లీ బిల్లును ఆమోదించింది.రాష్ట్రంలో విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులను గుర్తించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉన్నప్పటికీ, బిల్లు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపబడింది. ఇది అనవసరం. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై తనంతట తానుగా చర్య తీసుకోవచ్చు.

ముస్లిం రిజర్వేషన్ బిల్లును సమ్మతి కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపలేదు, కాపుల బిల్లును పంపారు. ఆ బాధ్యతను కేంద్ర ప్రభుత్వంపై మోపాలన్నదే ఉద్దేశం.1956 నుంచి కాపులకు రాజకీయంగా అధికారం లేదన్న కారణంగా అన్ని ప్రభుత్వాలు కాపులకు అన్యాయం చేశాయి. కానీ, కాపు సామాజికవర్గానికి చెందిన ఇద్దరు రాష్ట్ర అధ్యక్షులను నియమించి బీజేపీ తన నిబద్ధతను చాటుకుంది.ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో కాపులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అలా చేయకపోతే రాష్ట్ర ప్రజల ఆగ్రహాన్ని చూడవలసి వస్తుందని తెలియచేస్తున్నాను.

LEAVE A RESPONSE